iDreamPost
android-app
ios-app

వీడియో: సినిమా సీన్ రిపీట్.. పెళ్లి పీటల మీద వరుడికి షాకిచ్చిన వధువు!

  • Published Aug 28, 2023 | 10:23 AM Updated Updated Aug 28, 2023 | 10:25 AM
  • Published Aug 28, 2023 | 10:23 AMUpdated Aug 28, 2023 | 10:25 AM
వీడియో: సినిమా సీన్ రిపీట్.. పెళ్లి పీటల మీద వరుడికి షాకిచ్చిన వధువు!

కర్ణాటకలో ఊహించని ఘటన వెలుగు చూసింది. మరికొన్ని క్షణాల్లో వరుడు వధువు మెడలో తాళికడతాడు అనగా పెళ్లి కూతురు మండపంలోనే అందరి ముందే వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చింది. సినిమాను మించి ఉన్న ఈ సీన్ ను చూసి పెళ్లికి వచ్చిన బంధువులు అంతా ఒక్కసారిగా నోళ్లు తెరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు వధువు వరుడికి ఇచ్చిన షాక్ ఏంటి? ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని కోలాల ప్రాంతానికి చెందిన దివ్య అనే యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే ఇందులో భాగంగానే ఇటీవల ఓ యువకుడితో పెళ్లికి ముహుర్తం కూడా నిర్ణయించారు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. వధువు, వరుడు పెళ్లి మండపానికి వచ్చారు. వీరితో పాటు ఆశీర్వదించడానికి ఇరువురి బంధువులు అంతా హాజరయ్యారు. అయితే వరుడు తాళికట్టే సమయానికి ఆ వధువు వరుడికి ఊహించని షాకిచ్చింది. నేను ఓ యువకుడిని ప్రేమించానని, అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, మా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని వరుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

వధువు అలా చెప్పడంతో వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్న ఆ యువతి మాత్రం పెళ్లికి నో చెప్పింది. ఇక చేసేదేం లేక వధువు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు జోక్యం చేసుకుని వధువు కుటుంబ సభ్యులతో మాట్లాడి వరుడికి కొంత డబ్బును ఇప్పించి పంపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: పెళ్లి పీటలపై తాళిని విసిరి కొట్టిన వధువు! కారణం ఏమిటంటే?

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio