iDreamPost
android-app
ios-app

అమృతకు సర్ ప్రైజ్ ఇచ్చిన తల్లి.. మొదటిసారి వీడియోతో..!

  • Published Aug 28, 2023 | 5:53 PM Updated Updated Aug 28, 2023 | 5:53 PM
  • Published Aug 28, 2023 | 5:53 PMUpdated Aug 28, 2023 | 5:53 PM
అమృతకు సర్ ప్రైజ్ ఇచ్చిన తల్లి.. మొదటిసారి వీడియోతో..!

అమృత ప్రణయ్ తన జీవితంలో జరిగిన ఒక దారుణాన్ని అధిగమించి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తోంది. నిజానికి అమృత ఎంతో మందికి స్ఫూర్తి అని చెబుతూనే ఉంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ఎదురొడ్డి నిలవాలని ఆమె చేసి చూపిస్తోందంటున్నారు. అమృత- ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకోవడం, అమృత తండ్రి ప్రణయ్ ను కిరాయి గూండాలతో హత్య చేయించడం, ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత తన కుటుంబానికి అమృత దూరంగా ఉంటోందని అందరూ అనుకుంటున్నారు. అయితే తల్లిని కలుస్తూనే ఉన్న విషయాన్ని అమృత వీడియో ద్వారా వెల్లడించింది. అమ్మతో ఫస్ట్ వీడియో అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది.

ఇటీవల మొదటిసారి తల్లిని కలిసిన అమృత అంటూ చాలానే వార్తలు చూశారు. అమృతను కలిసిన వీడియో వాళ్ల అమ్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయింది. అందరూ మీరు కలిసిపోయారా అంటూ ప్రశ్నించడం. అమృతతో కలిసి ఒక వీడియో చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తన అభిమానులు, ఫాలోవర్స్ అందరికీ అమృత క్లారిటీ ఇవ్వాలని భావించింది. అందుకనే ఒక వీడియో రిలీజ్ చేసింది. అమ్మతో నా ఫస్ట్ వీడియో అంటూ అప్ లోడ్ చేసింది. ఆ వీడియోలో తన తల్లి రాత్రి వర్షానికి అమృత ఇంటికి వస్తుంది. ఆమె వస్తూనే కెమెరాతో వీడియో తీస్తూ వస్తుంది.

అమృత ఇంటి తలుపు కొట్టి సర్ ప్రైజ్ చేస్తుంది. ఆ తర్వాత వీడియో అమృత తీస్తుంది. రాగానే మనవడిని హత్తుకుని ఆప్యాయంగా ముద్దాడుతుంది. తన మనవడిని ఆడిపిస్తూ సంతోషంగా గడుపుతుంది. ఆ తర్వాత వారు ఏదైనా తిందామని.. బేల్ చేసుకుంటారు. ఆ బేల్ ప్రిపేర్ అయిన తర్వాత అమృత అసలు విషయాన్ని అందరికీ తెలియజేస్తుంది. “అమ్మ ఇటీవల నన్ను కలిసిన ఒక వీడియో పోస్ట్ చేసింది. అప్పుడు అందరూ మొదటిసారి కలిసిన అంటూ కామెంట్ చేశారు. అయితే నిజానికి అమ్మ నన్ను కలుస్తూనే ఉంది. కానీ, ఎప్పుడూ వీడియో తీయలేదు. ఆ తర్వాత అందరూ వీడియో తీయమని రిక్వెస్ట్ చేశారు. అందుకే ఇలా వీడియో తీశాం.

నన్ను నమ్మి నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ అసలు విషయం చెప్పాలి అని ఈ వీడియో చేశాను. అంతేకాకుండా అమ్మకు కెమెరాలు అంటే అంత ఇష్టం ఉండదవు. ఆమెకు కూడా వీడియోలో మాట్లాడేందుకు కొంత టైమ్ కావాలి కదా.. అందుకే ఇన్నాళ్లు వీడియో తీయలేదు. ఇదే అమ్మతో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. ఇంక ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను” అంటూ అమృత తన ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన వాళ్తందా మీ ఇద్దరినీ ఇలా చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş