Ira Khan:సార్ట్ హీరో కుమార్తె వివాహం.. టీషర్ట్ లోనే పెళ్లి

సాధారణంగా సెలెబ్రిటీల వివాహం అంటే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఎప్పటికపుడు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే, తాజగా ఓ సినీ సెలబ్రిటీ కూతురిని వివాహం చేసుకునేందుకు పెళ్ళికొడుకు వచ్చిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా సెలెబ్రిటీల వివాహం అంటే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఎప్పటికపుడు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే, తాజగా ఓ సినీ సెలబ్రిటీ కూతురిని వివాహం చేసుకునేందుకు పెళ్ళికొడుకు వచ్చిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సహజంగా స్టార్ సెలబ్రిటీ కూతురు పెళ్లంటే.. అంచనాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడంలో సెలెబ్రిటీల తర్వాతనే ఎవరైనా. పెళ్ళిలో జరిగే ప్రతి తంతును ప్రత్యేకంగా, గ్రాండ్ గా ఉండాలనే చూస్తూ ఉంటారు. అయితే, ఈ క్రమంలో ఓ స్టార్ సెలెబ్రిటీకి కాబోయే అల్లుడు మాత్రం సాదా సీదాగా.. అది కూడా ఓ టీషర్ట్ ధరించి పెళ్లి మండపానికి వచ్చి వివాహ తంతును పూర్తి చేశాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు కాబోయే అల్లుడు. తాజాగా, అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. అయితే ఈ క్రమంలో ఆమెకు కాబోయే భర్త పెళ్లి మండపడానికి వచ్చిన తీరు ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తుంది.

అమీర్ ఖాన్, రీనా దత్తాల కూతురు ఐరాఖాన్. ఈమె ‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థకు ఫౌండర్ గా వ్యవహరిస్తోంది. నిత్యం మెంటల్ హెల్త్ కు సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అయితే, కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ కు.. నూపుర్ పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉంటున్నాడు. అతడి వద్దే ఐరా కూడా ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక తాజాగా, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఐరాఖాన్, నూపుర్ జంట బందు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో.. ముంబైలో బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‏లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.

ఈ వివాహ వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్, నీతా అంబానీ దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఏ వివాహ వేడుకలో అయినా.. వరుడు బ్యాండ్ బారాత్ తో.. కాస్టలీ బట్టలు ధరించి కార్ లోనో లేదా గుర్రం పై ఊరేగుతూ పెళ్లి మండపానికి వస్తాడు. కానీ, ఇక్కడ మాత్రం ఈ ఫిట్ నెస్ ట్రైనర్ దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం కూడా చేసుకున్నాడు. ఇప్పుడున్న ట్రెండ్ కు పూర్తి భిన్నంగా వ్యవహరించి అందరిని ఆశ్చర్యపరిచాడు నూపుర్.

కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముందు ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా జరుపుకున్నారు. ఇక ఇప్పుడు, పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తరువాత మరోసారి వీరిద్దరి వివాహం ఈనెల 8న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది సమాచారం. ఈసారి అమీర్ ఖాన్ అల్లుడు ఎలా సర్ప్రైజ్ చేస్తాడో చూడాలి మరి. ఇక ప్రస్తుతం టీషర్ట్ లోనే పెళ్లి చేసుకున్న నూపుర్ కు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. మరి, ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియాజేయండి.

Show comments