iDreamPost
android-app
ios-app

వీడియో: పెంపుడు కుక్క బర్త్ డే.. 2.5 లక్షలతో గోల్డ్ చైన్ గిఫ్ట్!

  • Published Jul 08, 2024 | 4:15 PM Updated Updated Jul 08, 2024 | 4:15 PM

A Lady Bought 2.5 Lakh Worth gold Chain For Her Dog: ఒక మహిళ చేసిన పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆమె తన పెంపుడు కుక్కకు ఏకంగా రూ.2.5 లక్షలతో గోల్డ్ చైన్ బహూకరించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

A Lady Bought 2.5 Lakh Worth gold Chain For Her Dog: ఒక మహిళ చేసిన పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆమె తన పెంపుడు కుక్కకు ఏకంగా రూ.2.5 లక్షలతో గోల్డ్ చైన్ బహూకరించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jul 08, 2024 | 4:15 PMUpdated Jul 08, 2024 | 4:15 PM
వీడియో: పెంపుడు కుక్క బర్త్ డే.. 2.5 లక్షలతో గోల్డ్ చైన్ గిఫ్ట్!

సాధారణంగా పెంపుడు కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు వాటిని కాలక్షేపం కోసం పెంచుతూ ఉంటారు. ఇంకొంత మంది వాటిని ఒక ఇంటి మనిషిగా భావిస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే సొంత పిల్లలు లాగానే చూస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తనను చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కానీ, అది వాళ్లు పట్టించుకోరు. మీరు ఇప్పటి వరకు పెంపుడు కుక్కలకు సంబంధించి చాలానే విషయాలు విని ఉంటారు. కుక్కకు సీమంతం చేశారు అని.. కుక్కు దశదిన కర్మ చేశారు అని. అయితే ఇప్పుడు చెప్పుకునే వార్త వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోతున్న మహిళ ఏకంగా కుక్కకు రూ.2.5 లక్షలతో ఒక గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చింది.

పెంపుడు కుక్కలు అంటే అందరికీ అభిమానం ఉంటుంది. వాటిని చాలా మంది ఒక పెట్ లాగానే చూస్తారు. కానీ, ఇలాంటి వాళ్లు మాత్రం ఫ్యామిలీలా భావిస్తారు. అలా భావించింది కాబట్టే ఈ మహిళ తన పెంపుడు కుక్న టైగర్ కు దాని పుట్టినరోజు సందర్భంగా ఏకంగా ఒక గోల్డ్ చైన్ ని బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో అంజలి జ్యూయలర్స్ అనే హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఆమె ముంబయికి చెందిన మహిళ సల్దాన్హా గా చెప్పారు. ఆమె తన పెంపుడు కుక్క టైగర్ పుట్టిన రోజు సందర్భంగా వారి షాపులో ఒక గోల్డ్ చైన్ కొని దానికి బహూకరించిన విషయాన్ని వెల్లడించారు.

ఈ విషయం జరిగి చాలా రోజులే అవుతోంది. ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో జూన్ 16నే పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా, మీమ్స్, నెటిజన్స్ అంతా ఈ కుక్క..కాదు కాదు టైగర్, దాని ఓనర్ సల్దాన్హా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె టైగర్ కి బహూకరించిన చైన్ 35 గ్రాములు ఉంటుందని చెబుతున్నారు. ఆమె చైన్ దాని మెడలో వేయగానే అది తలను విదులుస్తూ చేసిన గెస్చర్ కు అంతా ఫిదా అయిపోతున్నారు. నెటిజన్స్ అంతా ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనుషులు, పెంపుడు జంతువులకు ఉన్న బంధాన్ని ఆమె చాలా అద్భుతంగా చెప్పిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఈ భూమి మీద ఆమె చేసింది ది బెస్ట్ పని అంటూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. టైగర్ కి రూ.2.5 లక్షలతో గిఫ్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by AnilJewellers (@aniljewellersofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş