Swetha
అదృష్టం వరించాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి అంటుంటారు. కటిక దరిద్రంలో ఉన్న కొంతమంది కూడా.. రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అయిపోతుంటారు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తిని వరించిన అదృష్టం గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
అదృష్టం వరించాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి అంటుంటారు. కటిక దరిద్రంలో ఉన్న కొంతమంది కూడా.. రాత్రికి రాత్రికి కోటీశ్వరులు అయిపోతుంటారు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తిని వరించిన అదృష్టం గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
Swetha
కొంతమంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ, వారు ఎంత కష్టపడినా కూడా.. ఎందుకో అదృష్టం వారి దరిదాపుల్లో కూడా లేకుండా.. కటిక దరిద్రంలోనే బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక వారు కూడా చేసేది ఎం లేక రోజులతో రాజి పడుతూ.. కాయ కష్టంతో కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఉంటారు. ఇక కొంతమందికైతే అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుకుని.. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే ఈ రెండు రకాల వారు కాకుండా.. తమ తలరాతను మార్చుకోవాలని.. ప్రయత్నిస్తూ.. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి .. లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. అందులో కూడా కొంతమందికి కలిసి వస్తుంది. మరి కొంతమందికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చే వారి విషయానికొస్తే.. వీరిలో రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయినా వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే.. కానీ, ఈ వ్యక్తి ఎవరో.. అతనికి కోట్ల రూపాయలలో అదృష్టం ఎలా వరించిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అదృష్టం అనేది అందరికి కలిసి రాదు. కొందరికి కష్టం సహకరిస్తే.. కొందరికి అదృష్టం సహకరిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఆటో డ్రైవర్ కథ కూడా ఇలాంటిదే. అతని పేరు నాజర్.. అతను తన భార్య పిల్లలతో కలిసి కేరళలో ఉండే కన్నూర్ లోని అలకోడేలో నివసిస్తూ ఉంటాడు. ఇతను ఒక సాధారణ ఆటో డ్రైవర్. తానొక్కడే కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం.. రూపాయి రూపాయి కూడబెడుతూ.. రాత్రి పగలు కష్టపడుతూ ఆటోను నడుపుతున్నాడు. ఇతని కష్టం వాసన దేవుడి వరకు చేరిందో ఏమో కానీ, లాటరీ రూపంలో ఇతనికి లక్ కలిసి వచ్చింది. ఓ రోజు నాజర్ 10 రూపాయల పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. గెలిస్తే 10 కోట్లు వస్తాయి.. పోతే పది రూపాయలు పోతాయి అనుకున్నాడు నాజర్. ఇంతలో కొన్ని రోజుల తర్వాత లాటరీ తీసే రోజు రానే వచ్చింది. తీరా చూస్తే ఏముంది..లాటరీలో తన తీసుకున్న టికెట్ నెంబర్ ఏ వచ్చింది. దీనితో నాజర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అదృష్టంగా వచ్చిన ఆనందాన్ని పట్టలేకపోయాడు.
అప్పటివరకు జీవితంలో ఎన్నో కష్ఠాలను చవి చూసిన అతనికి.. కేవలం పది రూపాయలు పెట్టుబడితో పది కోట్లు రావడంతో.. అతని కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. ఇప్పుడు వచ్చిన డబ్బుతో.. తనకంటూ ఒక ఇళ్ళు.. తన పిల్లలకు మంచి చదువును అందించాలని భావిస్తున్నాడట నాజర్. అప్పటివరకు అతనిని చిన్న చూపు చూస్తూ.. అప్పు అడిగినపుడు ఇవ్వని వారు కూడా.. ఇప్పుడు అతనినే అప్పు అడుగుతున్నారట. డబ్బు ఉంటేనే సమాజంలో మర్యాద, గౌరవం ఉంటాయని .. అలాగే డబ్బుతో సంబంధం లేకుండా.. నీతిగా నిజాయితీగా ఎవరైనా కష్టపడితే. వారికీ తగిన ఫలితాలు .. సరైన టైమ్ లో దేవుడు అందిస్తాడని.. నాజర్ జీవితంలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.