iDreamPost
android-app
ios-app

తమని కూడా ఆదుకోమంటున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్టిబ్యూటర్!

తమని కూడా ఆదుకోమంటున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిస్టిబ్యూటర్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు మారు మోగుతోంది. ఎందుకంటే ఆయన మొత్తం 100 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాయం కావాల్సిన వాళ్లు విజయ్ దేవరకొండ అందించిన ఆన్ లైన్ అప్లికేషన్ ని ఫిల్ చేసి దరఖాస్తు చేస్తున్నారు. ఈ పని వల్ల తప్పకుండా విజయ్ దేవరకొండకు చాలా మంచి పేరు, అభిమాన గణం వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు ఒక డిస్టిబ్యూటర్ తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. తమని కూడా ఆదుకోవాలని కోరాడు.

విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటించిన ఖుషి సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న రౌడీ హీరో ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఖుషి సినిమా వల్ల తన ఒక్క కుటుంబంలోనే కాదు.. అందరి ముఖాల్లో చిరునవ్వు రావాలని చెప్పాడు. అందుకే తనకి ఖుషీ సినిమా వల్ల వచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక కోటి రూపాయలను.. లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు అందజేస్తాని చెప్పాడు. అందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఆన్ లైన్ అప్లికేషన్ కూడా పెట్టాడు. సహాయం కావాల్సిన వాళ్లు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరాడు.

వారి టీమ్ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తామన్నారు. నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి విజయ్ దేవరకొండ సహాయం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ చేసిన అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. ఈ అంశంపై విజయ్ దేవరకొండ డిస్టిబ్యూటర్ స్పందించారు. విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ అభిషేక్ పిక్చర్స్ తమని కూడా ఆదుకోవాలంటూ కోరారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల తమకి రూ.8 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు.

తమకి వచ్చిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడలేదన్నారు. మీరు ఇప్పుడు రూ.కోటి డొనేట్ చేస్తున్నాను అన్నారు. అందులో భాగంగా మా డిస్టిబ్యూటర్స్, ఎక్సిబిటర్స్ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆకాంక్షిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టు చేయడంపై అభిషేక్ పిక్చర్స్ ఉద్దేశం ఏంటని విజయ్ ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయినా సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతను అడగాలి.. హీరోకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. సినిమా హిట్ అయి లాభాలు వస్తే.. డిస్టిబ్యూటర్స్ ఏమైనా హీరోకి ఇస్తున్నారా? అంటు గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. అభిషేక్ పిక్చర్స్ రిక్వెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.