iDreamPost
android-app
ios-app

ఆంజనేయ స్వామి మాలలో విశ్వక్ సేన్! వైరలవుతున్న ఫొటోలు

  • Author Soma Sekhar Published - 05:49 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 05:49 PM, Mon - 25 September 23
ఆంజనేయ స్వామి మాలలో విశ్వక్ సేన్! వైరలవుతున్న ఫొటోలు

విశ్వక్ సేన్.. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తనదైన యాటిట్యూడ్ తో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మూవీ ఈవెంట్స్ లో ఫ్యాషన్ ఐకాన్ లా ట్రెండ్ ను సెట్ చేస్తూ.. తన డ్రస్సింగ్ స్టైల్ ను చూపిస్తుంటాడు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాడు ఈ యంగ్ హీరో. మరి అలాంటి విశ్వక్ సేన్.. తాజాగా ఆంజనేయ స్వామి మాలలో కనిపించి అందరిని షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

ఎప్పుడూ ఫ్యాషన్ డ్రస్సుల్లో కనిపించి ఆశ్చర్యపరిచే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా ఆంజనేయ స్వామి మాలలో కనిపించి షాక్ కు గురిచేశాడు. సడెన్ గా భక్తి మార్గంలో కనిపించే సరికి ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం హోస్ట్ గా మారిన విశ్వక్ ఆహాలో ఫ్యామిలీ ధమాకా అనే షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో ఈ లుక్ లో కనిపించారు విశ్వక్. అదీకాక తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫొటోను షేర్ చేసి జై భజరంగ్ బలి అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక విశ్వక్ సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ‘గామి’ అనే మరో కన్సెప్ట్ బేస్డ్ మూవీ కూడా విశ్వక్ నుంచి రానుంది. అయితే విశ్వక్ తన సినిమాల విడుదల సమయంలో చేసే ఫ్రాంక్ వీడియోలు వివాదాలకు కారణం అవుతూ ఉంటాయని చెప్పాలి. గతంలో ఫ్రాంక్ చేసి వివాదం అయిన సంఘటనలు మనం చూసే ఉన్నాం. అలాంటి విశ్వక్ ఒక్కసారిగా భక్తి మార్గంలోకి రావడంతో.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)