iDreamPost
android-app
ios-app

ప్రభాస్ మైనపు విగ్రహంపై విమర్శలు! ఇలా చేశారేంటంటూ ఫ్యాన్స్ రచ్చ!

  • Author Soma Sekhar Published - 05:11 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 05:11 PM, Mon - 25 September 23
ప్రభాస్ మైనపు విగ్రహంపై విమర్శలు! ఇలా చేశారేంటంటూ ఫ్యాన్స్ రచ్చ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక పక్క ‘సలార్’, మరో పక్క ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో నటిస్తున్నాడు. అయితే డార్లింగ్ కు ఇటీవలే మోకాలికి సర్జరీ జరిగిందని, ప్రస్తుతం షూటింగ్ కు బ్రేకిచ్చినట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా ప్రభాస్ మైనపు విగ్రహం అంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ మైనపు విగ్రహాన్ని మైసూర్ లో ఓ మ్యూజియంలో ఏర్పాటు చేశారంటూ నెటిజన్లు ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఈ విగ్రహంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఏంట్రా ఇలా తయ్యారు చేశారు అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ మైనపు బొమ్మ అంటూ ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ విగ్రహాన్ని మైసూర్ లో ఏర్పాటు చేశారంటూ.. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఆ విగ్రహం ప్రభాస్ దే అని జీర్ణించుకోవడమే కాస్త కష్టంగా మారింది డార్లింగ్ ఫ్యాన్స్ కు. రేయ్ ఎవడ్రా ఇది తయ్యారు చేసింది? అసలు ప్రభాస్ ఇలా ఉంటాడారా? అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కావాలనే మా హీరోను ఇలా ట్రోల్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ మైనపు విగ్రహం నెట్టింట్లో వైరల్ గా మారింది.

అసలు ఆ విగ్రహం ప్రభాస్ లా లేదని, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ లా ఉందని కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరు బాహుబలిలో ఓ మూలన ఉన్న సైనికుడిలా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు సడెన్ గా చూస్తే.. డేవిడ్ వార్నర్ లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.  కావాలనే కొందరు మా హీరోని ఇలా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. కాగా.. ప్రభాస్ సలార్ విషయానికి వస్తే.. గ్రాఫిక్స్ బాలేదని మరిన్ని హంగులు దిద్దుతున్నారు మేకర్స్. విడుదల తేదీపై ఇంకా గందరగోళం నెలకొని ఉంది. ఈ విషయంలోనే నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు మైనపు బొమ్మ మరో తలనొప్పిగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibom