iDreamPost
android-app
ios-app

టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆపేయాలి.. స్టువర్టుపురం ప్రజల నిరాహారదీక్ష!

  • Published Sep 08, 2023 | 12:42 PM Updated Updated Sep 08, 2023 | 12:42 PM
  • Published Sep 08, 2023 | 12:42 PMUpdated Sep 08, 2023 | 12:42 PM
టైగర్ నాగేశ్వరరావు మూవీ ఆపేయాలి.. స్టువర్టుపురం ప్రజల నిరాహారదీక్ష!

తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది.  రవితేజ నటించిన ధమాకా మూవీ కాస్త పరవాలేదు అనిపించినా.. రావణసూర మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా మాస్ మహరాజ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిక్కుల్లో పడింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీలో తమ ఊరుపేరు, జాతిని దారుణంగా అవమానించారని స్టువర్టుపురం గ్రామస్థులు నిరసనలు తెలుపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల టాలీవుడ్ లో పలు బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పటి స్టువర్టుపురంలోని ఓ గజదొంగ జీవిత కథ ఆధారంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. ఈ మూవీకి దర్శకత్వం వంశీ కృష్ణ.. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చిక్కుల్లో పడింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన జాతి, యాసతో పాటు తమ గ్రామాన్ని కూడా తప్పుగా, నీచంగా చూపించారని స్టూవర్ట్ పురం గ్రామస్థులు నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపగా.. పలు సంఘాలు వీరికి మద్దతుగా నిలబడుతున్నారు.

ఈ మూవీ నిలిపి వేయాలని కోరుతూ ఇప్పటికే స్టూవర్టుపురం గ్రామస్థులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లక్షల మంది ఆత్మగౌరవం, మనోభావాలను దెబ్బతినేలా చూపించిన ఈ మూవీ తక్షణమే ఆపివేయాలని, విడుదల కు అనుమతి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టూవర్ట్ పురం ఏరియాను నేరపూరితమైనదిగా, టైగర్ నాగేశ్వరరావును కృూరమైన వ్యక్తిగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. కాగా, 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీశర్మ, గాయత్రీ భార్గవి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది.