iDreamPost
android-app
ios-app

‘సలార్’ ఆ మూవీకి రీమేకా? అసలు విషయం ఏంటంటే?

  • Author Soma Sekhar Updated - 10:47 AM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Updated - 10:47 AM, Mon - 2 October 23
‘సలార్’ ఆ మూవీకి రీమేకా? అసలు విషయం ఏంటంటే?

‘ఇదిగో పులి అంటే.. అదిగో తోక’ అనే రోజులు ఇవి. ఈ సామెత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ఏదైనా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, టీజర్ కానీ విడుదల అవ్వగానే.. ఇది ఆ సినిమాలాగా ఉంది, ఈ సీన్ అచ్చం ఆ మూవీలోదే.. దింపేశాడు అనే మాటలు వినిపించడం సర్వసాధారణమే. ప్రస్తుతం సలార్ మూవీకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటంటే? స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ ఏకంగా రీమేక్ అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దానికి బలమైన కారణాలను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మరి ఇంతకీ సలార్ రీమేక్ అంటూ వస్తున్న వార్తలు నిజమా? అబద్దమా? ఇప్పడు తెలుసుకుందాం.

సలార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియాన్ మూవీ. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులే కాక.. యావత్ భారతదేశం కూడా ఎదురుచూస్తోంది. నిజానికి సెప్టెంబర్ 28నే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సిన సలార్ పలు కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సమాచారం ప్రకారం డిసెంబర్ 22న ఈ మూవీని విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? సలార్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఉగ్రం’ మూవీకి రీమేక్ అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. దానికి కారణం ఉగ్రం సినిమాను జీ5, హంగామా, వూట్ యాప్స్ నుంచి తొలగించారని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

2014లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో శ్రీ మురళి, హరిప్రియా జంటగా తెరకెక్కిన చిత్రం ఉగ్రం. యాక్షన్ మూవీకి తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిత్రం ఆ యాప్స్ నుంచి ఎందుకు తొలగించారు? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉగ్రం మూవీని పలు యాప్స్ నుంచి తీసేయడంతో.. సలార్ దానికి రీమేక్ అంటూ వార్తలు బయలుదేరాయి. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా సలార్.. ఉగ్రం మూవీకి రీమేక్ అనే అర్ధం వచ్చేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ కు రీమేక్ చేసే అవసరం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రీమేక్ వార్తలపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి సలార్ మూవీ ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş