iDreamPost
android-app
ios-app

రజినీ సినిమాలో రానా.. షెకావత్! జై భీమ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

  • Author Soma Sekhar Published - 03:40 PM, Tue - 3 October 23
  • Author Soma Sekhar Published - 03:40 PM, Tue - 3 October 23
రజినీ సినిమాలో రానా.. షెకావత్! జై భీమ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ కావడం.. దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించడంతో.. రజినీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కాగా.. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తో రజినీ 170వ సినిమా ప్రకటన రావడంతో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీలో టాలీవుడ్ స్టైలిష్ నటుడు రానాతో పాటుగా టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్ అఫీషియల్ గా ప్రకటించింది.

రజినీకాంత్ 170వ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. జైభీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఒక యథార్థ సంఘటన ఆధారంగా సూపర్ స్టార్ తో మూవీని అనౌన్స్ చేశాడు. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి ‘తలైవర్ 170’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టైలిష్ నటుడు రానాతో పాటు.. ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది లైకా ప్రొడక్షన్ సంస్థ. కాగా.. మూవీలో దుషారా విజయన్, రిత్విక సింగ్ లాంటి యంగ్ హీరోయిన్స్ తో పాటుగా మంజు వారియర్ కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే రజినీకాంత్ కు విలన్ గా వీరిద్దరు నటిస్తారా? లేక ఇంకేదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తారా? అన్నది వేచిచూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet