iDreamPost
android-app
ios-app

సీక్వెల్ కు రెడీ అవుతున్న రామ్ చరణ్! స్క్రిప్ట్ సిద్ధమేనట!

  • Author Soma Sekhar Published - 04:44 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 04:44 PM, Mon - 28 August 23
సీక్వెల్ కు రెడీ అవుతున్న రామ్ చరణ్! స్క్రిప్ట్ సిద్ధమేనట!

ఇండస్ట్రీలో హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం సహజమే. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కు సీక్వెల్స్ వచ్చి విజయం సాధించగా.. మరికొన్ని అపజయాలను చవిచూశాయి. అయితే కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ కు ఇప్పటి వరకు సీక్వెల్స్ రాలేదు. వాటికి పార్ట్ 2 వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రాలేదు. అలాంటి సినిమాల్లో రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామగా తెరకెక్కిన ధృవ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా ధృవ 2 రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ధృవ 2 మూవీ రాబోతుందట. ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ధృవ.. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన మూవీ. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పిచ్చెక్కించింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే తమిళ బ్లాక్ బస్టర్ ‘తని ఒరువన్’ రీమేక్ గా ధృవ సినిమాను తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. జయం రవి హీరోగా 2015లో తని ఒరువన్ మూవీని డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ చేశాడు. కాగా.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారట. అయితే ధృవ 2 వచ్చేది తెలుగు లో కాదు తమిళంలో. అర్దం కాలేదా? ఈ రోజు చెన్నైలోని ఏజిఎస్ థియేటర్ లో తని ఒరువన్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు.

అందులో భాగంగా సీక్వెల్ కు సంబంధించిన వీడియో టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. మోహన్ రాజానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది. దీంతో తమిళంలో తీస్తే కచ్చితంగా తెలుగులో కూడా వస్తుంది అన్నది గట్టి నమ్మకం. దాంతో ధృవ 2 సీక్వెల్ కు రెడీ అవుతున్నాడట రామ్ చరణ్. అదీకాక మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ మూవీని తెరకెక్కించే సమయంలో మోహన్ రాజాకి మెగా ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఏర్పాడింది. ఆ మూవీ షూటింగ్ టైమ్ లోనే రామ్ చరణ్ తో ధృవ 2కి సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం. కథ పూర్తి కాగానే రామ్ చరణ్ కు చెప్తానని మోహన్ రాజా అప్పుడే చెప్పారట.

దీంతో ఇప్పుడు కథ సిద్ధం కావడంతో.. బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్ ధృవ 2 చేయడం పక్కా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సీక్వెల్ కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారా? లేదా మోహన్ రాజానే డైరెక్షన్ చేస్తారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. కాగా.. ధృవ టీమ్ నే కొనసాగించబోతున్నట్లు సమాచారం. దాంతో ఎన్నో సంవత్సరాలుగా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతుందన్న న్యూస్ తెగ సంతోషాన్ని ఇస్తోంది. మరి ధృవ 2 సీక్వెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఒకే వేదికపై సుదీప్‌, దర్శన్‌.. గొడవలు ఆగినట్లేనా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet