iDreamPost
android-app
ios-app

యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మెుక్కిన రజినీకాంత్! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Published - 10:06 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 10:06 PM, Sat - 19 August 23
యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మెుక్కిన రజినీకాంత్! వైరలవుతున్న వీడియో

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన స్టైల్ కు, అనుకువకు, మంచితనానికి, హీరోయిజానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. 70 సంవత్సరాల వయసు వచ్చినా గానీ తనలో సత్తువ ఇంకా తగ్గలేదని తాజాగా వచ్చిన జైలర్ సినిమాతో నిరూపించాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ వారం రోజుల్లోనే రూ. 450 కోట్లు కలెక్ట్ చేసి సునామీ సృష్టించింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. టైగర్ ముత్తువేల్ పాండ్యాన్ గా రజినీకాంత్ తన విశ్వరూపం చూపాడు ఈ చిత్రంలో. ఈ మూవీకి ఉత్తరభారతంలో కూడా భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. తీవ్ర చర్చకు దారితీసింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన నటనతోనే కాకుండా.. వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్నాడు. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో వరల్డ్ వైడ్ గా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. 70 పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ..ఔరా అనిపిస్తున్నారు. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 450 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకు ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది.

అదీకాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఈ మూవీ చూడ్డానికి ఆసక్తి కనబర్చారు అంటేనే రజినీకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్దం అవుతోంది. కాగా.. జైలర్ మూవీ సక్సెస్ తర్వాత హిమాలయాల్లో పర్యటించాడు రజినీ. అనంతరం జార్ఖండ్ వెళ్లి.. శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ కు చేరుకున్నాడు. అక్కడ రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశాడు రజినీకాంత్. ఆ తర్వాత యూపీ రాజధాని లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తన సతీమణితో వెళ్లి కలిశాడు.

ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ సూపర్ స్టార్ కు సాదర స్వాగతం పలికారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాదర స్వగతం పలికేందుకు వచ్చిన సీఎం యోగి కాళ్లకు పాదాభి నమస్కారం చేశాడు సూపర్ స్టార్ రజినీ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయసులో తన కంటే చిన్నవాడు అయిన యోగి కాళ్లు రజినీకాంత్ మెుక్కడం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నారు. కాగా కొన్ని కానుకలను రజినీకి అందజేశాడు సీఎం యోగి. మరి రజినీకాంత్ యోగి కాళ్లు మెుక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ఎమోషనల్ వీడియోకి కారణం చెప్పిన అనసూయ.. మరో వీడియో పోస్ట్

marsbahis girişjojobetjojobet giriş