iDreamPost
android-app
ios-app

భారీ స్థాయిలో ‘జైలర్’ ప్రీ రిలీజ్ బిజినెస్! ఎన్నికోట్లంటే?

  • Author Soma Sekhar Published - 09:52 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Published - 09:52 PM, Tue - 8 August 23
భారీ స్థాయిలో ‘జైలర్’ ప్రీ రిలీజ్ బిజినెస్! ఎన్నికోట్లంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇది పేరు మాత్రమే కాదు. ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. రజినీ వెండితెరపై కనిపిస్తే చాలు, ఫ్యాన్స్ కు పూనకాలే. ఇక సూపర్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. డైరెక్టర్ నెల్సన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా.. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. మరి సూపర్ స్టార్ ఎంత బిజినెస్ చేశాడు.. ఎంత రాబట్టాలో ఇప్పుడు చూద్దాం.

‘జైలర్’.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెుత్తం ఎదురుచూస్తున్న సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, తమన్నా లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు నెల్సన్. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది చిత్ర యూనిట్. అదీకాక జైలర్ నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా తమన్నా డ్యాన్స్ తో ఓ ఊపు ఊపిన ‘నువ్ కావాలయ్య నువ్ కావాలయ్య’ సాంగ్ దుమ్మురేపుతోంది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. జైలర్ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రూ. 62 కోట్లు, కేరళ రూ. 5.5 కోట్లు, కర్ణాటక రూ. 10 కోట్లు, రెస్టాఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 30 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 112.50 కోట్ల షేర్(రూ. 240 కోట్ల గ్రాస్) ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో జైలర్ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే.. రూ. 124 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే రజినీ గ్రేస్ ముందు ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా తక్కువనే చెప్పాలి. అదీకాక ఇప్పటికే మెుదలైన అడ్వాన్స్ బుక్కింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. తలైవా మూవీకి హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. మరి గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రజినీ ఖాతాలో హిట్ పడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)


ఇదికూడా చదవండి: క్లీన్ కారాకు మెగాస్టార్ దంపతుల అదిరిపోయే గిఫ్ట్! అదేంటో తెలుసా?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom