iDreamPost
android-app
ios-app

కీర్తి సురేష్‌ను పట్టించుకోని రజినీకాంత్‌.. కావాలనే అలా చేశాడా?

  • Published Jul 06, 2023 | 11:43 AM Updated Updated Jul 06, 2023 | 11:43 AM
  • Published Jul 06, 2023 | 11:43 AMUpdated Jul 06, 2023 | 11:43 AM
కీర్తి సురేష్‌ను పట్టించుకోని రజినీకాంత్‌.. కావాలనే అలా చేశాడా?

ప్రముఖ తమిళ దర్శకుడు మారీ సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మామన్నన్‌’. ఉదయ నిధి స్టాలిన్‌, వడివేలు, ఫాహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మామన్నన్‌’కు తమిళనాట మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఈ సినిమాపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో బుధవారం  ఓ పోస్టు పెట్టారు.

ఆ పోస్టులో.. ‘‘ మారీ సెల్వరాజ్‌ అద్భుతమైన పనితనం కనబరిచాడు. సమానత్వం గురించి చాలా చక్కగా చూపించాడు. అతడికి నా మెచ్చుకోలు. సినిమాలో అద్భుతంగా నటించిన వడివేలు, ఫాహద్‌ ఫాజిల్‌, ఉదయనిధి స్టాలిన్‌లకు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. అయితే, సినిమాలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ పేరు కూడా ఎత్తలేదు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని కొంతమంది నెటిజన్లు కీర్తి సురేష్‌పై ట్రోలింగ్స్‌ చేయడానికి వాడుకుంటున్నారు.

దీనిపై పలు రకాల మీమ్స్‌ చేసి ట్రోలింగ్స్‌ చేస్తున్నారు. కాగా, కీర్తి సురేష్‌ ‘అన్నాత్తే’ సినిమాలో రజినీకాంత్‌తో కలిసి నటించారు. ఈ సినిమాలో రజినీకాంత్‌కు చెల్లెలిగా నటించారు. ఇద్దరి మధ్యా మంచి అనుబంధం కూడా ఉంది. అలాంటిది రజినీకాంత్‌ కీర్తి పేరు చెప్పకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆయన మరిచిపోయి కీర్తి పేరు చెప్పలేదా? లేక కావాలనే అలా చేశారా? అన్నది తలైవాకే తెలియాలి. మరి, రజినీకాంత్‌ తన ట్వీట్‌లో కీర్తి సురేష్‌ పేరు చెప్పకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss