iDreamPost
android-app
ios-app

Radhe Shyam : తీసేసిన సన్నివేశాలే దెబ్బ కొట్టాయా

  • Published Mar 12, 2022 | 4:30 PM Updated Updated Mar 12, 2022 | 4:30 PM
  • Published Mar 12, 2022 | 4:30 PMUpdated Mar 12, 2022 | 4:30 PM
Radhe Shyam : తీసేసిన సన్నివేశాలే దెబ్బ కొట్టాయా

నిన్న విడుదలైన రాధే శ్యామ్ టాక్ సంగతి కాసేపు పక్కనపెడితే కలెక్షన్లు మాత్రం బాగా నమోదవుతున్నాయి. మొదటి రోజు ఎగ్జైట్మెంట్ అయిపోయింది కాబట్టి ఇవాళ రేపు హౌస్ ఫుల్ బోర్డులు ఎలాగూ పడతాయి. సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలుకానుంది. ఒకవేళ సినిమా కనక ఆశించిన స్థాయిలో ఉండింటే మాత్రం పాత రికార్డుల ముక్కలు ఒక్కటి కూడా మిగిలి ఉండేవి కాదన్నది అభిమానుల కామెంట్. అయితే రాధే శ్యామ్ ఎడిటింగ్ లో చాలా కత్తెర్లు పడ్డాయని రిలీజ్ కు ముందు నుంచీ వినిపిస్తున్న మాట. సెన్సార్ అయ్యాక కూడా రాజమౌళి చెప్పిన రికమండేషన్ల ఆధారంగా 12 నిముషాలు కట్ చేశారని సినీ వర్గాల్లో ప్రచారమయ్యింది.

అది నిజమని నిన్న సినిమా చూశాక క్లారిటీ వచ్చేసింది. మాములుగా ట్రైలర్ కట్ లో చాలా కీలకమైన సన్నివేశాలు పొందుపరుస్తారు. దాన్ని బట్టే ప్రేక్షకులకు వెళ్లాలా వద్దా అనే అంచనాకు వస్తారు. కానీ విచిత్రంగా రాధే శ్యామ్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. ఉదాహరణకు రిద్ది కుమార్ ఆర్చరీ గేమ్ లో పాల్గొనే సీన్ ఒకటుంది. ఆ అమ్మాయి వర్షం పడుతుండగా గ్రౌండ్ లో అరిచే షాట్ ని ట్రైలర్ లో చూపించారు. కానీ మూవీలో మాత్రం ఓ పేపర్ క్లిప్పింగ్ తో సరిపుచ్చారు. ప్రభాస్ ఫోటో ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో పడటం, విక్రమాదిత్య ఇంట్లో నుంచి జగపతిబాబు మెట్లు దిగుతూ కిందకు వచ్చే సీన్ కూడా మాయమైపోయింది.

వీటితో పాటు మరికొన్ని షాట్స్ ట్రైలర్ లో ఉన్నవి ఫైనల్ వెర్షన్ లో మాయమయ్యాయి. అసలు ప్రభాస్ పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ ని కాస్త తగ్గించి వీటిని పెట్టినా బాగుండేది కానీ ఇప్పుడదే ల్యాగ్ రూపంలో కంప్లయింట్ గా మారిపోయింది మళ్ళీ జోడిస్తారా లేక ఇక్కడితో వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. హిందీ వెర్షన్ ని విడిగా తీసినప్పటికి నార్త్ లోనూ ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం లేదు. మొదటి రోజు హిందీ బెల్ట్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదని ట్రేడ్ రిపోర్ట్. ఏపి తెలంగాణలో మటుకు స్ట్రాంగ్ గానే ఉన్న రాధే శ్యామ్ కు అసలైన సవాల్ సోమవారం నుంచి మొదలు కానుంది. కానీ బ్రేక్ ఈవెన్ అంత సులభంగా కనిపించడం లేదు

Also Read : RRR : ప్రీమియర్లకు రంగం సిద్ధం చేస్తున్న రాజమౌళి

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio