iDreamPost
android-app
ios-app

Choreographer Jani: జానీ మాస్టర్‌ ఇష్యూలో ఆ స్టార్‌ హీరో హస్తంపై క్లారిటీ ఇచ్చిన పుష్ప-2 నిర్మాత!

  • Published Sep 23, 2024 | 4:45 PM Updated Updated Sep 23, 2024 | 4:45 PM

Choreographer Jani: కొంతకాలం నుంచి జానీ మాస్టర్ వివాదం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.

Choreographer Jani: కొంతకాలం నుంచి జానీ మాస్టర్ వివాదం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.

Choreographer Jani: జానీ మాస్టర్‌ ఇష్యూలో ఆ స్టార్‌ హీరో హస్తంపై క్లారిటీ ఇచ్చిన పుష్ప-2 నిర్మాత!

గత కొంతకాలం నుంచి జానీ మాస్టర్ వివాదం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయం పై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాజాగా మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఇంట్రాక్షన్ జరిగింది. ఒక రిపోర్టర్ జానీ మాస్టర్ వ్యవహారం గురించి ఆయన్ని అడిగారు. జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా అని అడిగారు. దాంతో రవిశంకర్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.

ఇది జానీ మాస్టర్, సదరు లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పర్సనల్ విషయం అని రవిశంకర్ అన్నారు. పుష్ప 2 సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆమె అడిషనల్ కొరియోగ్రాఫర్ గా సినిమాకి పనిచేసిందని అన్నారు. ఆమె పేరు ఎక్కడా చెప్పకూడదు కాబట్టి నేనేమీ చెప్పట్లేదు. మేము 6 నెలల క్రితం పుష్ప 2 సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ వీడియోస్ లో కూడా ఆమె పేరు ఉంది. నిజానికి ఈ సినిమాలో జానీ మాస్టర్ తో ఓ స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల్లో షూటింగ్ జరగబోతుంది అనగా ఇలా జరిగిపోయిందని అన్నారు. ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇది కేవలం వాళ్ళ పర్సనల్ విషయం అని ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోయిందని అన్నారు. దానిమీద నేనేమీ మాట్లాడలేనని అన్నారు.

ఇక అల్లు అర్జున్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైనా డాన్సర్లు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ అని విష్ చేస్తే తిరిగి విష్ చేయడం తప్ప అంతకు మించి అల్లు అర్జున్ కి వాళ్ళు ఎవరో కూడా తెలీదని చెప్పుకొచ్చారు. దీంతో జానీ మాస్టర్ వ్యవహ్హారంలో పుష్ప2 టీం కి ఏమాత్రం సంబంధం లేదని అది వాళ్ళ వ్యక్తిగత వ్యహారం అని నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇక పుష్ప2 సినిమాలో మరో రెండు పాటలు ఉన్నాయని అక్టోబర్ 15 తర్వాత వాటిని షూట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నామని రవి శంకర్ అన్నారు. మరి జానీ మాస్టర్ వ్యవహారం గురించి పుష్ప నిర్మాత రవి శంకర్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobetjojobet giriş