iDreamPost
android-app
ios-app

పుష్ప 2 – అప్పటిదాకా ఎదురుచూపులే

  • Published Jun 11, 2022 | 3:51 PM Updated Updated Jun 11, 2022 | 3:52 PM
  • Published Jun 11, 2022 | 3:51 PMUpdated Jun 11, 2022 | 3:52 PM
పుష్ప 2 – అప్పటిదాకా ఎదురుచూపులే

గత డిసెంబర్ లో విడుదలై ఇక్కడ కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 1కి కొనసాగింపు ది రూల్ ఎప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో ఇంతకీ ఈ ఏడాది రిలీజ్ ఉండదనే అనుమానం బలంగా నెలకొంది. బన్నీ వాస్ ఇచ్చిన అప్ డేట్ ప్రకారం జూలై చివరి వారంలో పుష్ప 2 చిత్రీకరణ మొదలుకానుంది. 2023 వేసవిలో రిలీజయ్యే అవకాశం ఉంది. అంతకన్నా ముందు సంక్రాంతికని కొన్ని మీడియా మాధ్యమాల్లో రావడం తప్పని తేలిపోయింది. ఎందుకంటే వచ్చే నెల స్టార్ట్ చేసినా పూర్తి చేయడానికి చాలా టైం కావాలి. అంచనాలు పెరగడంతో చాలానే మార్పులు చేశారు.

ఇటీవలే బాలీవుడ్ కల్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ప్రత్యేకంగా దర్శకుడు సుకుమార్ కి వాట్సాప్ మెసేజ్ చేయడం, అందులో పుష్ప మేకింగ్ గురించి సంగీత తదితర విభాగాలను మెచ్చుకుంటూ సుదీర్ఘమైన సందేశం పంపడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 3 ఇడియట్స్, మున్నాభాయ్, పీకే లాంటి మాస్టర్ పీసెస్ ఇచ్చిన లెజెండరీ మేకర్ స్వయానా ఫోన్ నెంబర్ కనుక్కుని మరీ కాంటాక్ట్ అయ్యారంటే సుక్కుకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఇప్పుడా స్క్రీన్ షాటే వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్ అంతటి గొప్ప స్టార్ ఇరవై ఏళ్ళు ఎదురు చూసిన రాజ్ కుమార్ హిరానీ నుంచి కాంప్లిమెంట్ రావడమంటే అదో అచీవ్ మెంటే.

ఫస్ట్ పార్ట్ లో ఉన్నవాళ్ళంతా పుష్ప 2లోనూ కొనసాగబోతున్నారు. షెడ్యూల్స్ ఫిక్స్ చేశాక ఆర్టిస్టుల డేట్లను ఫైనల్ చేయబోతున్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ,సునీల్, రావు రమేష్, అనసూయ లాంటి బిజీ నటీనటులు చాలా మంది ఉండటంతో అనుకున్న టైంలో ఫినిష్ చేయడం అంత సులభంగా ఉండేలా లేదు. అల్లు అర్జున్ దీని కోసమే హెయిర్ స్టైల్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. పుష్ప తర్వాత ఎవరితో చేయాలనే దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకో ఆరేడు నెలలు గడిస్తే కానీ ఐకాన్ స్టార్ ని హ్యాండిల్ చేయబోయే డైరెక్టర్ ఎవరనేది తెలుస్తుంది.2022లో బన్నీ మూవీ రాదని అర్థమైపోయిందిగా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet