iDreamPost
android-app
ios-app

పవర్‌స్టార్‌ అభిమానులకు నిరాశ.. బ్రో టీజర్‌ విడుదల ఆలస్యం!

  • Published Jun 29, 2023 | 6:15 PM Updated Updated Jun 29, 2023 | 6:21 PM
  • Published Jun 29, 2023 | 6:15 PMUpdated Jun 29, 2023 | 6:21 PM
పవర్‌స్టార్‌ అభిమానులకు నిరాశ..  బ్రో టీజర్‌ విడుదల ఆలస్యం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్–సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమా బ్రో. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన వినోదయసీతాం సినిమాకు అధికారిక రీమేక్‌గా బ్రో తెరకెక్కుతంది. పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో.. సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమిళ్‌లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేసి.. తెరకెక్కిస్తున్నారు. సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉండటంతో.. మూవీకి సంబంధించి ఎంత ఇన్న అప్డేట్‌ అయినా సరే నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్‌.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూన్‌ 29న అనగా నేడు(గురవారం) ఈ సినిమా టీజర్‌ విడుదల చేస్తామని మేకర్స్‌ ‍ప్రకటించారు. దాంతో అభిమానులంతా.. బ్రో టీజర్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  సినిమా మీద ఇంకా ఇంకా హైప్‌ పెంచుతూ నిన్నటి నుంచి మేకర్స్.. వరుస పోస్టర్స్‌తో రచ్చ చేస్తున్నారు.

ఇక బ్రో టీజర్‌ కోసం ఆత్రుతతగా ఎదురు చూస్తోన్న అభిమానులకు సడెన్‌ షాక్‌ తగిలింది. బ్యాడ్‌ న్యూస్‌ వినాల్సి వచ్చింది. అందేంటంటే.. బ్రో టీజర్‌ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ మేకర్స్‌ వెల్లడించారు. ​​‘‘బ్రో టీజర్‌ మాస్‌ సెలబ్రేషన్స్‌కు చిన్న అంతరాయం కలిగింది. ఇందుకు మేం ఎంతగానో చింతిస్తున్నాం. అనుకోకుండా సాంకేతిక లోపం ఒకటి ఎదురయ్యింది.  దాంతో టీజర్‌ విడుదలకు కాస్త అంతరాయం కలుగుతుంది. కాసేపు మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే.. సమ్యను పరిష్కరిస్తాం. కాస్త సంయమనం పాటించండి’’ అని విజ్ఞప్తి చేశారు చిత్ర బృందం.

చిత్ర బృందం టీజర్ గురించి అప్డేట్‌ ఇచ్చినప్పుడే.. పవన్, తేజ్‌లు ఊరమాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు. సినిమా మీద అంచనాలు పెంచేలా… కొత్త కొత్త పోస్టర్స్‌ రిలీజ్‌ చేస్తూ.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.  దీనిలో భాగంగా… పవన్ క్లాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్‌ సూటల్‌లో  కనిపించాడు పవన్‌ కళ్యాణ్‌. నిన్నటి నుంచి టీజర్‌ విడుదల అంటూ ఊరించి.. చివరికి ఇలా చేస్తారా అంటున్నారు అభిమానులు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet