iDreamPost
android-app
ios-app

Nivetha Pethuraj : నివేత పేతురాజ్ కు మెగా ఛాన్స్

  • Published Mar 16, 2022 | 7:24 PM Updated Updated Mar 16, 2022 | 7:24 PM
  • Published Mar 16, 2022 | 7:24 PMUpdated Mar 16, 2022 | 7:24 PM
Nivetha Pethuraj : నివేత పేతురాజ్ కు మెగా ఛాన్స్

అందం అభినయం రెండూ ఉన్నప్పటికీ సరైన పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ నివేత పేతురాజ్ కు ఆ సమయం దగ్గరకు వచ్చినట్టు ఉంది. చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో మాస్ మహారాజా సరసన జోడిగా ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇటీవలే చిరు సరసన మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నివేతను తీసుకోవడం చూస్తే తనకు కీలకమైన పార్ట్ తో పాటు పాటలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రవితేజ ఈ సినిమా కోసం ఏప్రిల్ లో ప్రత్యేకంగా కాల్ షీట్స్ ఇచ్చేసి తక్కువ షెడ్యూల్స్ లో వీలైనంత త్వరగా తన పార్ట్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.

సో నివేత కూడా దానికి అనుగుణంగానే డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 2017లో మెంటల్ మదిలోతో టాలీవుడ్ కు వచ్చిన నివేతకు డెబ్యూనే మంచి సక్సెస్ అందించింది. కానీ భారీ చిత్రాలు రాకపోవడంతో కెరీర్ అంతగా ముందుకు సాగలేదు. బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో సక్సెస్ అయినా కూడా వాటి వల్ల కలిగిన ప్రయోజనం తక్కువే. గత ఏడాది రెడ్, పాగల్ రెండూ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఆహా కోసం చేసిన ఇండిపెండెంట్ మూవీ బ్లడీ మేరీ మీద చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తనకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది నివేత. ఇదయ్యాక ఒకే చేసిన ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి లేవు.

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్న పరిస్థితిలో నివేతకు అవకాశాలు తగ్గిపోవడం వింతే. రవితేజ సరసన జోడి అంటే వయసు పరంగా ఆలోచంచడానికేమి లేదు. శ్రీలీలలాంటి కొత్తమ్మాయే సిద్ధపడినప్పుడు నివేత వెనుకడుగు వేయడం కరెక్ట్ కాదు. మెగా 154గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ ప్రచారంలో ఉంది. 2023 విడుదలకు టార్గెట్ చేశారు.
ఒకవేళ ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే నివేతకు మంచి బ్రేక్ దక్కుతుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో ఈ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల నుంచి కంటిన్యూ చేయబోతున్నారు.

Also Read : Beast : కన్నడ సినిమా ఛాయల్లో విజయ్ మూవీ

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet