iDreamPost
android-app
ios-app

Nara Rohit Weds Siri Lella.. నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే?

  • Published Oct 16, 2024 | 4:29 PM Updated Updated Oct 16, 2024 | 4:46 PM

Nara Rohit Weds Siri Lella: నారా రోహిత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లెల్లతో నారా రోహిత్ వివాహం కానుంది.

Nara Rohit Weds Siri Lella: నారా రోహిత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లెల్లతో నారా రోహిత్ వివాహం కానుంది.

  • Published Oct 16, 2024 | 4:29 PMUpdated Oct 16, 2024 | 4:46 PM
Nara Rohit Weds Siri Lella.. నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే?

టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయినా కానీ రొటీన్ సినిమాలు చేయకుండా డీఫెరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేశాడు. ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేశాడు. చాలా సినిమాల్లో తన నటనతో మంచి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నారా రోహిత్ లో మేజర్ ప్లస్ పాయింట్ తన వాయిస్. అలా తన వాయిస్ తో, నటనతో మంచి నటుడిగా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నారా రోహిత్. ఇప్పటికీ నారా రోహిత్ నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కచ్చితంగా ఓ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతలా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక ఇదిలా ఉంటే నారా రోహిత్ త్వ‌ర‌లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయ‌నకు పెళ్లి ఘ‌డియ‌లు వ‌చ్చేశాయి. తన ప్ర‌తినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరిలెల్ల‌ని నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్‌లో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నారా రోహిత్, సిరిలెల్ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు హాజరయ్యారు. అలాగే సిరిలెల్ల కుటుంబ స‌భ్యులతో పాటు రెండు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు నిశ్చితార్ధ వేడుకకు హాజ‌ర‌య్యారు. ఇలా ఇరు కుటుంబాల బంధువుల ఆశీర్వాదంతో నారా రోహిత్, సిరిలెల్ల‌ నిశ్చితార్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.2018 దాకా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రోహిత్.. ఆ త‌ర్వాత దాదాపు ఆరు సంవత్సరాలు సినిమాల‌కు దూరంగా ఉన్నారు. మంచి సోరీ కోసం గ్యాప్ తీసుకున్నారు. దాదాపు 400 వందల కథల దాకా విన్నారట. కానీ ‘ప్రతినిధి 2’ స్టోరీ బాగా నచ్చి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేగాక ఆ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యహరించాడు. ఈ ఏడాది ప్ర‌తినిధి 2 సినిమా వచ్చింది. ఈ సినిమాతో కూడా రోహిత్ మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే హీరోయిన్ సిరితో రోహిత్‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ‌గా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఇక సిరిలెల్ల విషయానికి వస్తే.. ఈమె సొంత ఊరు ఆంధ్ర ప్రదేశ్లోని ఒంగోలు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి హౌస్ వైఫ్. వీరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.సిరిలెల్లకి తాను డిగ్రీ చేసే టైమ్ లో సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో సినిమాల్లో నటించాలని అనుకుంది. కానీ అప్పుడు ఇంట్లో ఒప్పుకోలేదట. దాంతో ఆస్ట్రేలియా వెళ్ళిపోయి మాస్టర్స్ చేసింది. తిరిగి హైదరాబాద్ వచ్చిన సిరిలెల్ల మళ్ళీ తన సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకుంది. ఎలాగోలా తన పేరెంట్స్ ని ఒప్పించింది. ఆ తరువాత నుంచి సినిమా ఆడిషన్స్ కి అటెండ్ అయ్యేది. కొన్ని ఫోటోఘాట్స్ కూడా చేసింది. ఈ క్రమంలో ప్రతినిధి 2 కి తన ఫోటోస్ పంపించి ఆడిషన్స్ కి అటెండ్ అయ్యింది. ఆమె అందం, అభినయం నచ్చడంతో తనని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలా సిరిలెల్ల హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నారా రోహిత్, సిరి దగ్గరయ్యారు. అలా మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సిరిలెల్ల నారా రోహిత్ ప్రేమలో పడిపోయింది. వీరి పెళ్లి డిసెంబర్‌ 15న జరగనుంది. ఇది సంగతి. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నారా రోహిత్, సిరిలెల్ల జంట గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss