iDreamPost
android-app
ios-app

తమన్ టార్గెట్ అయ్యాడే!

  • Published Jun 08, 2022 | 3:04 PM Updated Updated Jun 08, 2022 | 3:04 PM
  • Published Jun 08, 2022 | 3:04 PMUpdated Jun 08, 2022 | 3:04 PM
తమన్ టార్గెట్ అయ్యాడే!

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ,మ్యూజిక్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉన్నవాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్ దూకుడు బాగా తగ్గిపోయాక దర్శక నిర్మాతలకు పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. దానికి తోడు అల వైకుంఠపురములో తర్వాత తమన్ దూకుడు మాములుగా లేదు. ముఖ్యంగా అఖండకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసిందో, బాలయ్య హీరోయిజం పీక్స్ కు వెళ్లడంలో ఎంతగా దోహదపడిందో ప్రత్యక్షంగా చూశాం. అంత స్థాయి కాకపోయినా భీమ్లా నాయక్ కు వచ్చిన అప్లాజ్ తక్కువేమి కాదు. రాధే శ్యామ్ కు ప్రత్యేకంగా జిజిఎం కోసమే తనను తీసుకోవడం అది డిజాస్టరైనా సరే ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి.

అలాంటి తమన్ ఇప్పుడు కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు. నిన్న జరిగిన ఇండియన్ ఐడల్ సింగింగ్ గ్రాండ్ ఫినాలే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మూడు సరైనోడు, రేసు గుర్రం, అల వైకుంపురములో అల్లు అర్జున్ తోనే ఉన్నాయని సెలవిచ్చాడు. ఇందులో తప్పేముందనేగా డౌట్. ఈ ప్రోగ్రాం స్ట్రీమింగ్ అవుతున్న ఆహా యాప్ అల్లు ఫ్యామిలీదన్న సంగతి తెలిసిందే. కేవలం అది దృష్టిలో ఉంచుకుని తనకు పెద్ద హిట్లు ఆ హీరో నుంచే వచ్చాయని చెప్పడం గురించే ఇతర స్టార్ల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కిక్ లాంటి పెద్ద బ్రేక్ ఇచ్చిన రవితేజ ప్రస్తావన ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

అంతే కాదు మహేష్ బాబుకు దూకుడు, బిజినెస్ మెన్, సర్కారు వారి పాట లాంటి ఆల్బమ్స్ చేసినప్పుడు వాటి గురించి ఎందుకు చెప్పలేదని సూపర్ స్టార్ ఫాన్స్ లాజిక్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి హీరోకు తమన్ తో భారీ సక్సెస్ లు ఉన్నాయి. కానీ ఆహా ప్రోగ్రాంకు వచ్చాను కాబట్టి బన్నీ గురించి మాత్రమే చెప్పాలని తమన్ అనుకోవడం వల్లే ఈ చిక్కంతా. ఏది ఎలా ఉన్నా తమన్ గ్రాఫ్ మాత్రం ప్రస్తుతం మెట్రో స్పీడ్ లో ఉంది. గాడ్ ఫాదర్, విజయ్ 66, రామ్ చరణ్ 15, మహేష్ బాబు 28 ఇలా క్రేజీ ప్రోజెక్టులన్నీ తన ఖాతాలోనే వేసుకున్నాడు. ఏదో ఫ్లోలో అనే కొన్ని మాటలు ఒక్కోసారి ట్విట్టర్ లాంటి వేదికల్లో ఎంత దూరం వెళ్తాయో చూశారా

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss