iDreamPost
android-app
ios-app

తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పోస్ట్!

  • Author Soma Sekhar Published - 09:55 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Published - 09:55 PM, Sat - 5 August 23
తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ పోస్ట్!

మృణాల్ ఠాకూర్.. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలీదు. కానీ ఇప్పుడు ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తికాదు. అంతలా ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటుగా సీత పాత్రలో నటించిన మృణాల్ కు ఫిదా అయ్యారు తెలుగు ఆడియెన్స్. తన తొలి సినిమాకే ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేసింది మృణాల్.

ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో పేరు రావడం అంటే అదృష్టం అనే చెప్పాలి. అలా ఒకే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతా రామం’ సినిమాలో సీత పాత్రలో జీవించింది ఈ అమ్మడు. దుల్కర్ సల్మాన్ కు జోడీగా ఈ చిత్రంలో నటించింది. వీరి కెమిస్ట్రీ బాగా కుదరడంతో పాటుగా మూవీ పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది మృణాల్ ఠాకూర్.

ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది మృణాల్..”డియర్ ఆడియన్స్.. హీరోయిన్ గా నా ఫస్ట్ తెలుగు మూవీ ‘సీతా రామం’ నేను అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు నాపై ప్రేమను చూపించారు. ఇక నన్ను మీ తెలుగింటి అమ్మాయిలా ఆదరించారు. ఈ జర్నీలో అమితమైన ప్రేమాభిమానాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు. మరికొన్ని సంవత్సరాల పాటు విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని ఆనందింప జేస్తానని మాటిస్తున్నాను” అంటూ ఎమోషలన్ పోస్ట్ రాసుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఇ

ఇక నా నుంచి సీత బెస్ట్ వెర్షన్ ను వెండితెరపైకి తీసుకొచ్చిన డైరెక్టర్ హను రాఘవపూడికి, ఈ చిత్రాన్ని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్ తో పాటు చిత్ర బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సీతారామం మేకింగ్ వీడియోను పంచుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా.. ప్రస్తుతం మృణాల్ హీరో నానితో ‘ హాయ్ నాన్న’తో పాటుగా విజయ్ దేవరకొండ తో ఓ సినిమాను చేస్తోంది. మరి సినిమాను పిచ్చి పిచ్చిగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మృణాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)


ఇదికూడా చదవండి: 2 లక్షలిస్తా.. కమిట్ మెంట్ ఇస్తావా? అని అడిగాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

marsbahis giriş