iDreamPost
android-app
ios-app

2 లక్షలిస్తా.. కమిట్ మెంట్ ఇస్తావా? అని అడిగాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Updated - 09:41 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Updated - 09:41 PM, Sat - 5 August 23
2 లక్షలిస్తా.. కమిట్ మెంట్ ఇస్తావా? అని అడిగాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఎంతో మంది యువతులు, యువకులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ఎన్నో చీత్కారాలను, కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక హీరోయిన్ కావాలని కలలు కనే యువతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీకి వచ్చే యువతుల కలను ఆసరాగా చేసుకుని తాము అడిగింది ఇస్తే.. అవకాశాలు ఇస్తామని కొన్ని ఏజెన్సీలు చెబుతూ ఉంటాయి. ఇలాంటి వారికి కొందరు ఘాటుగా సమాధానలు ఇస్తూ ఉంటారు. మరికొందరు భయంతో, ఆందోళనతో కన్నీరు పెట్టుకుంటూ తమలోనే దాచుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్ ప్రాచీ ఠాకర్.. రాజుగాడి కోడి పులావ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పరిశ్రమకు దూరం అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రాచీ ఠాకర్ మాట్లాడుతూ..”నేను చదువుకునే రోజుల్లోనే పటాస్ మూవీ చేశాను. ఆ తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్లు ఒక యాడ్ చేయాలని నన్ను సంప్రదించారు. నేను సరే అన్నాను. కానీ నాకు ఆ భాష రాకపోవడంతో.. తెలుగు ఫ్రెండ్ ను మీడియేటర్ గా పెట్టుకున్నాను.

కాగా.. నాకు అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చారు. నా ఫోన్ నంబర్ తీసుకుని షూటింగ్ ఎప్పుడు అన్నది చెప్తానన్నాడు. ఆ తర్వాత మీరు కమిట్ మెంట్ ఇస్తున్నారు కదా? అని అడిగాడు. నాకు అర్ధం కాలేదు. షూటింగ్ ఎప్పుడు ఉంటే అప్పుడే కమిట్ మెంట్ ఇస్తానని చెప్పాను. అయితే కమిట్ మెంట్ కు నువ్వు రెడీ కాదా? అని మరోసారి ప్రశ్నించాడు. నాకు ఒక పార్ట్ నర్ ఉన్నాడు నీకు 2 లక్షలిస్తాడు అతడితో కాంప్రమైజ్ అవుతావా? అన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అతడి భాష నాకు అర్దం కాకపోవడంతో.. నా ఫ్రెండ్ కు ఇదంతా చెప్పానని ఆమె తెలిపింది. దాంతో అతడు నాకు పూసగుచ్చినట్లు మెుత్తం చెప్పాడంతో.. ఆ యాడ్ చేయనని చెప్పినట్లుగా ప్రాచీ ఠాకర్ పేర్కొంది.

ఇదికూడా చదవండి: అల్లు అర్జున్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? బన్నీకి ఏమాత్రం తీసిపోదు..

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom