iDreamPost
iDreamPost
చాలా గ్యాప్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఒక చెప్పుకోదగ్గ హిందీ క్రైమ్ వెబ్ సిరీస్ రిలీజయ్యింది. అదే మాయ్. తెలుగు ఆడియోని డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉంచడంతో మన ప్రేక్షకులకు సైతం భాషతో ఇబ్బంది లేకుండా అయ్యింది. మొత్తం ఆరు ఎపిసోడ్లతో అంతా కలిపి నాలుగున్నర గంటల నిడివి ఉన్న ఈ థ్రిల్లర్ కు ఆన్షల్ లాల్ – అతుల్ మోంగియా సంయుక్త దర్శకత్వం వహించారు. సినిమాల్లో కనిపించడం ఎప్పుడో మానేసిన రైమా సేన్ ఇందులో రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. మనకు తెలుసున్న ఆర్టిస్టులు పెద్దగా లేకపోయినప్పటికీ సెటప్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఇబ్బంది లేదు. ఎలా ఉందో రిపోర్ట్ చూద్దాం.
లక్నో నగరంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో నర్స్ గా పని చేస్తుంటుంది షీల్(సాక్షి తన్వర్). భర్త యష్(వివేక్ ముష్రన్) ఎలక్ట్రీషియన్. కూతురు సుప్రియా(వామికా గబ్బి) మూగది. అయినా డాక్టర్ కోర్స్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఊహించని విధంగా ఓ రోజు షీల్ చూస్తుండగానే సుప్రియా ట్రక్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. ఇది హత్యని అనుమానం వచ్చిన షీల్ స్వయంగా పరిశోధనకు పూనుకుంటుంది. ఈ క్రమంలో ఎవరికి తెలియకుండా ఓ హత్య చేస్తుంది. చనిపోయిన వ్యాపారవేత్త ప్రియురాలు నీలమ్(రైమా సేన్) తన ముఠాతో కలిసి హంతకులను వెతుకుతుంది. ఆ తర్వాత జరిగేది స్మార్ట్ స్క్రీన్ లోనే చూడాలి.
మొదలుపెట్టడం కొంత నెమ్మదిగా ఉన్నా ఆ తర్వాత గ్రిప్పింగ్ గా సాగుతూ మధ్య మధ్యలో ల్యాగ్ ఉన్నప్పటికీ ఫైనల్ గా ఓకే అనిపిస్తుంది మాయ్. బిడ్డను పోగొట్టుకున్న తల్లి తన చావుకు కారణమైన వాళ్ళను వెతికే క్రమాన్ని ఆసక్తికరంగా చూపించారు. కొంత భాగం నమ్మశక్యంగా లేనప్పటికీ సాక్షి తన్వర్ పెర్ఫార్మన్స్ తో పాటు ఇతర ఆర్టిస్టుల ప్రెజెన్స్ మంచి అవుట్ ఫుట్ రావడంలో దోహదపడింది. అయితే ఇలాంటి క్రైమ్ సిరీస్ లను రెగ్యులర్ గా చూసేవాళ్లకు అంతగా కొత్తదనం అనిపించకపోవడం ఇందులో ప్రధాన మైనస్. ఎపిసోడ్లు ఆరే అయినప్పటికీ ఇంకాస్త కుదించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫైనల్ గా డీసెంట్ వాచ్ అనిపించుకుంది