iDreamPost
android-app
ios-app

చిరంజీవి రేంజ్ కు తగ్గట్లు మ్యూజిక్ ఇవ్వలేకపోయా! భోళా శంకర్ మ్యూజిక్‌ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 10:13 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Published - 10:13 PM, Fri - 18 August 23
చిరంజీవి రేంజ్ కు తగ్గట్లు మ్యూజిక్ ఇవ్వలేకపోయా! భోళా శంకర్ మ్యూజిక్‌ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

భోళా శంకర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సినిమా. మెహర్ రమేష్ డైరెక్షన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ మూవీ. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అనుకున్న రేంజ్ లో ఈ మూవీ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరశాకు గురైయ్యారు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో మెగాస్టార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమాపై పలు వివాదాలు కూడా నెలకొన్నాయి. చిరంజీవికి ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం ప్రొడ్యూసర్ ఇల్లు, తోటలు అమ్ముకున్నారన్న వార్తులు వైరల్ కాగా.. వీటిపై వివరణ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. ఇక తాజాగా మరోసారి భోళా శంకర్ మూవీ వార్తల్లో నిలిచింది. మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇవ్వలేకపోయానని సంగీత దర్శకులు మహతి స్వర సాగర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఒక సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకు సంగీతం కూడా అంతే ముఖ్యం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ.. పాటలు కానీ కాస్త అటూ ఇటుగా అయ్యాయి అంటే ఆ సినిమాపై ప్రభావం చూపిస్తాయనడంలో అసత్యంలేదు. తాజాగా భోళా శంకర్ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నాడు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్. ఇతడి ఖాతాలో ఇది వరకు మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. దీంతో మెగాస్టార్ కు ఓ రేంజ్ లో పాటలు ఇస్తాడని అందరు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. భోళా శంకర్ లో ఒక్క పాట కూడా చార్ట్ బస్టర్ కాకపోవడంతో పాటుగా పాటలు సినిమాకు మైనస్ గా మారాయని అభిమానులు చెబుతున్నారు.

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరింతగా దిగజార్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నా ఫ్యాన్స్. ఇక భోళా శంకర్ మ్యూజిక్ పై తాను కూడా అసంతృప్తిగా ఉన్నట్లు మహతి స్వర సాగర్ వెబ్ మీడియా ద్వారా తెలిపాడు. మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్లుగా నేను మ్యూజిక్ అందించలేదు. నేను కంపోజ్ చేసిన పాటల పట్ల నేను సంతృప్తిగా లేను. ఓ ప్రేక్షకుడిగా సినిమా చూశాకా.. ఇంకా మంచిగా పనిచేయాల్సిందని అనిపించింది అని మహతి స్వర సాగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భోళా శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


ఇదికూడా చదవండి: ప్రభాస్ కోరిక తీరుస్తున్న మంచు విష్ణు! కానీ.. పెద్ద ప్లానే ఇది!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet