iDreamPost
android-app
ios-app

Raj Tharun: ఒకే ఫ్లాట్ లో రాజ్ తరుణ్, మాల్వి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య!

  • Published Sep 07, 2024 | 11:27 AM Updated Updated Sep 07, 2024 | 12:56 PM

Raj Tharun: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ జరిగింది. వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి ఇప్పటి దాకా హైదరాబాద్ అడ్డాగా ఉండేది. ఇప్పుడు వీరి వివాదం ముంబైకు షిఫ్ట్ అయ్యింది.

Raj Tharun: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ జరిగింది. వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి ఇప్పటి దాకా హైదరాబాద్ అడ్డాగా ఉండేది. ఇప్పుడు వీరి వివాదం ముంబైకు షిఫ్ట్ అయ్యింది.

  • Published Sep 07, 2024 | 11:27 AMUpdated Sep 07, 2024 | 12:56 PM
Raj Tharun: ఒకే ఫ్లాట్ లో రాజ్ తరుణ్, మాల్వి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య!

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ జరిగింది. ఇప్పటి దాకా వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి హైదరాబాద్ అడ్డాగా ఉండేది. అయితే ఇప్పుడు వీరి వివాదం ముంబైకు షిఫ్ట్ అయ్యింది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌లో ఉన్నట్లు లావణ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె లీక్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లావణ్య విడుదల చేసిన ఈ వీడియోలో రచ్చ మాములుగా లేదనే చెప్పాలి. రాజ్ తరుణ్ తనవాడే అంటూ మాల్వీ మల్హోత్రాతో గొడవ పెట్టుకుంది లావణ్య.

రాజ్ తరుణ్ కు తనకు మధ్య 11 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పుకొచ్చింది. రాజ్‌ తరుణ్‌ను వదిలేయమని మాల్వీకి వార్నింగ్ ఇచ్చింది. ఇక మాల్వి కూడా వెనక్కి తగ్గలేదు. గెట్ ఔట్‌ అంటూ లావణ్యకు కౌంటర్ ఇచ్చింది. అయితే రాజ్‌తరుణ్‌ కూడా అదే ఫ్లాట్‌లో ఉండటం వివాదానికి బలం చేకూర్చింది. రాజ్ తరుణ్ ని రికార్డ్ చేసిన లావణ్య.. వాళ్ల మధ్య సంబంధానికి ఈ దృశ్యాలే రుజువని చెప్పింది. రాజ్‌తరుణ్‌, మాల్విని పట్టుకోవడం కోసం లావణ్య ఆమె తండ్రితో ముంబై వెళ్లింది. ఇక లావణ్య తమను బాగా ఇబ్బంది పెడుతోందని మాల్వీ మల్హోత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లావణ్య తండ్రిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజ్‌తరుణ్‌పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తనను ప్రేమించి, మోసం చేశాడని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తెలిపారు. లావణ్య, రాజ్‌తరుణ్‌ పది సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇంకా ఈ దర్యాప్తులో లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు చార్జ్‌షీట్‌లో తెలిపారు. అయితే తాజాగా ఈ వివాదంలో ఈ ట్విస్ట్ రావడంతో.. ఈ వివాదంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో అనే ఉత్కంఠ మొదలైంది. మరి చూడాలి మున్ముందు ఏమవుతుందో.. ఇంకా కొనసాగుతున్న రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి వివాదం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet