iDreamPost
android-app
ios-app

వీడియో: మేనల్లుడి విజయం చూసి పొంగిపోయిన చిరంజీవి సతీమణి!

  • Published Aug 26, 2023 | 3:20 PM Updated Updated Aug 26, 2023 | 5:28 PM
  • Published Aug 26, 2023 | 3:20 PMUpdated Aug 26, 2023 | 5:28 PM
వీడియో: మేనల్లుడి విజయం చూసి పొంగిపోయిన చిరంజీవి సతీమణి!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ పేరు మారు మోగుతూనే ఉంది. 69 ఏళ్లలో టాలీవుడ్ హీరోకి మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఈ విజయాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది. స్టార్ హీరోలు మొదలు బడా బడా నిర్మాతలు, దర్శకులు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి.. ఇంత మంది విషెస్ చెబుతుండగా.. మేనల్లుడికి అత్తత సురేఖ శుభాకాంక్షలు చెప్పకుండా ఉంటారా? సురేఖ నేరుగా ఇంటికి వచ్చేసి అల్లు అర్జున్ విషెస్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ కు పుష్ప సినిమాలో చేసిన పుష్పరాజ్ పాత్రకు గానూ 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో వేదికగా అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. పుష్ప సినిమా నిర్మాత, సుకుమార్ అంతా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అందరూ బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. సుకుమార్ అయితే అల్లు అర్జున్ ని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. చాలాసేపు వదలకుండా అలాగే పటేటుకుని ఉన్నాడు. అయితే అదేరోజు చాలా మంది బన్నీని కలుసుకుని విషెస్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ సతీమణి సురేఖ బన్నీని కలిసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మేనల్లుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందని తెలియగానే సురేఖ పరుగున అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో వారి మధ్య ఉన్న అనుబంధం, అవార్డు దక్కడంపై సురేఖ ఎంత ఆనందంగా ఉన్నారనేది చూడచ్చు. అల్లు అరవింద్ తో మాట్లాడుతూ సురేఖ హాలులో వెయిట్ చేస్తుండగా.. అటుగా బన్నీ మేడమ్ అంటూ పరుగున వస్తాడు. అల్లు అర్జుని సురేఖ ఎంతో సంతోషంగా హత్తుకుని శభాష్ అంటూ భుజం తట్టారు. మేనల్లుడికి ముద్దు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ పై సురేఖకు ఉన్న ఆప్యాయతను ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లుచూడచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss