iDreamPost
android-app
ios-app

‘ఖుషి’ మూవీ రెమ్యూనరేషన్ల లిస్ట్.. వామ్మో అంత తీసుకున్నారా?

  • Author Soma Sekhar Published - 03:33 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 03:33 PM, Sun - 20 August 23
‘ఖుషి’ మూవీ రెమ్యూనరేషన్ల లిస్ట్.. వామ్మో అంత తీసుకున్నారా?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకున్నట్లు టీజర్, ట్రైలర్ తోనే అర్ధం అయ్యింది. కాగా.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటంటే? ఖుషి మూవీ కోసం విజయ్, సమంత డైరెక్టర్ శివ నిర్వాణ తీసుకున్న రెమ్యూనరేషన్ అన్ని కోట్లు? అంటూ ఓ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో వీళ్లు ఇంత రెమ్యూనరేషన్ తీసుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇంతకి వారు ఎన్ని కోట్లు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

డైరెక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, సమంత వీరి ముగ్గురికి ప్రస్తుతం ఓ హిట్ కావాలి. లైగర్ తో విజయ్, శాకుంతలంతో సమంత, టక్ జగదీష్ తో శివ నిర్వాణ డీలా పడ్డారు. ఇలాంటి టైమ్ లో వీరికి మాంచి హిట్ పడితే గానీ ట్రాక్ మీదకు రారు. ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్న తాజాగా మూవీ ఖుషి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదేంటంటే? ఖుషి మూవీ కోసం విజయ్ దేవరకొండ ఏకంగా రూ. 23 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట. ఇక సమంత కూడా అదే రేంజ్ లో రూ. 4.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ శివ నిర్వాణ సైతం భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడట. శివ నిర్వాణ ఈ మూవీకి ఏకంగా రూ. 12 కోట్లు తీసుకున్నడని టాక్ వినిపిస్తోంది. ఈ రెమ్యూనరేషన్లకు సంబంధించిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీంతో ఈ రేంజ్ లో పారితోషికాలు ఏంటి సామి అంటూ నెటిజన్స్ షాక్ కు గురౌతున్నారు. 10 నుంచి 15 కోట్లు తీసుకునే విజయ్.. 23 కోట్లు తీసుకోవడం ఏంటి? అలాగే సామ్ కూడా అంత మెుత్తంలో ఇవ్వకపోవచ్చు. ఇదంతా ఒకెత్తు అయితే డైరెక్టర్ శివ నిర్వాణకు 12 కోట్లు అంటే నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ లో పారితోషికాలు తీసుకున్నారు అన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరో! ఫొటోలు వైరల్..

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet