iDreamPost
android-app
ios-app

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరో! ఫొటోలు వైరల్..

  • Author Soma Sekhar Published - 02:30 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 02:30 PM, Sun - 20 August 23
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న యంగ్ హీరో! ఫొటోలు వైరల్..

సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ళు, ఎంగేజ్ మెంట్ లు జరుగుతూనే ఉన్నాయి. పలు ఇండస్ట్రీలకు చెందిన నటీ, నటులు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ.. కొత్త జీవితానికి నాంది పలుకుతున్నారు. తాజాగా ఓ యువ హీరో సైతం మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. తాను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకున్నాడు ఈ హీరో. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.

కెవిన్.. కోలీవుడ్ యంగ్ హీరో.. ఇటీవలే ‘దాదా’ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకుని ఊపుమీదున్నాడు. తొలుత సీరియల్స్ చేసిన ఈ యువ హీరో.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రావణన్ మీనాక్షి, తాయుమానవన్ లాంటి సీరియల్స్ తో బుల్లితెర హీరోగా మారాడు. కాగా.. 2017లో వచ్చిన శత్రియాన్ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఈ తర్వాత సంవత్సరమే నాట్పున్న ఎన్ననాను తెరియుమా సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది వచ్చిన దాదా మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలోనే మోనిక డేవిడ్ తో ప్రేమలో పడ్డాడు కెవిన్. వీరిద్దరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో.. ఆదివారం(ఆగస్టు 20) ఉదయం ఘనంగా వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై.. కొత్త జంటను దీవించారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పాటుగా కొంతమంది నటీ, నటులు ఈ పెళ్లికి వచ్చారు. కాగా.. కెవిన్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ సతీష్ తో ఓ మూవీని చేస్తున్నాడు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు, నెటిజనులు.

 

View this post on Instagram

 

A post shared by Kavin M (@kavin.0431)


ఇదికూడా చదవండి: ‘కొత్త ప్రేమను కనుగొన్నా’ వైరలవుతున్న సమంత పోస్ట్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss