Krishna Kowshik
Krishna Kowshik
మాదాపూర్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్‌లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రముఖ నటుడు నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి విదితమే. ఆయన్ను ఏ 29గా పోలీసులు పేర్కొన్నారు. నవదీప్ డ్రగ్స్ వినియోగిస్తున్నాడని తేలిందని, అతడ్ని త్వరలో అరెస్టు చేస్తామంటూ నార్కోటిక్ పోలీసులు పేర్కొనడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఈ నెల 19 వరకు ఆయన అరెస్టు చేయవద్దని పేర్కొంది. ఆ గడువు పూర్తి కావస్తుండటతో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ, తనపై విచారణ నిలిపివేయాలంటూ నవదీప్ పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ చేపట్టిన కోర్టు దాన్ని కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు తొలుత హైకోర్టు నుండి ఊరట కలిగినప్పటికీ.. ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది.
నవదీప్ మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నాడంటూ పోలీసులు అతడి పేరును నిందితుడిగా చేర్చారు. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుండగా.. హైకోర్టును ఆశ్రయించగా..ఈ నెల 19 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కోర్టు పేర్కొంది. అయితే ఈ క్రమంలో ఆయన ఇంట్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. అదేవిధంగా తనపై విచారణ నిలిపివేయాలని, బెయిల్ కూడా కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. ఆయన పిటిషన్ ను డిస్పోజ్ చేసిన కోర్టు 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని నవదీప్‌ను ఆదేశించింది. ప్రొసీజర్ ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులకు సూచించింది. నవదీప్ సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని నార్కోటిక్ పోలీసుల హెచ్చరిక జారీ చేశారు.