iDreamPost
android-app
ios-app

ఆ సినిమాకు అవార్డు రానందుకు తీవ్ర నిరాశలో నాని!

  • Published Aug 25, 2023 | 9:36 PM Updated Updated Aug 25, 2023 | 9:37 PM
  • Published Aug 25, 2023 | 9:36 PMUpdated Aug 25, 2023 | 9:37 PM
ఆ సినిమాకు అవార్డు రానందుకు తీవ్ర నిరాశలో నాని!

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు దక్కని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్నాడు. బన్నీకి అవార్డు దక్కడంపై సర్వత్రా ప్రశంసలు, పొగడ్తలు వెల్లువెత్తాయి. పాన్ ఇండియా లెవల్లో ఉన్న హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, అభిమానులు అందరూ అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెప్పారు. అయితే అల్లు అర్జున్ అవార్డు దక్కడంపై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఒక ఎర్రచందనం స్మగ్లర్ పాత్రకు ఉత్తమ నటుడి అవార్డు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. జైభీమ్ లాంటి సినిమాని తెరమీదకు తీసుకొస్తున్నారు.

పుష్పరాజ్ కు అవార్డు దక్కడంపై చాలా మందే అసహనం వ్యక్తం చేశారు. జైభీమ్ లాంటి సినిమా రేసులో ఉండగా పుష్ప సినిమాకి అవార్డులు ఎలా దక్కాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రకు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. జైభీమ్ సినిమాలో అణగారిన వర్గాలకు మద్దతుగా నిలిచిన లాయర్ పాత్ర చేసిన సూర్యకు మాత్రం అవార్డు దక్కలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ విధంగా పుష్పరాజ్ పాత్రకు అవార్డు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. అగ్రవర్ణాల అకృత్యాలను కళ్లకు కడుతూ ఎంతో హృద్యంగా సాగిన జైభీమ్ సినిమాకి అన్యాయం జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు.

జాతీయ అవార్డులపై నాని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. తెలుగు సినిమా నుంచి జాతీయ అవార్డులు అందుకున్న అందరికీ నేచురల్ స్టార్ నాని శుభాకాంక్షలు చెప్పాడు. ట్రిపులార్ టీమ్, ఉప్పెన, పుష్ప సినిమాలకు కంగ్రాట్స్ చెప్పాడు. అలాగే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడంపై అల్లు అర్జున్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. తెలుగు సినిమా నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా నువ్వు నిలవడం మరింత ఆనందగా ఉంది అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన సెకండ్ స్టోరీలో మాత్రం జైభీమ్ సినిమా పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్త పరిచాడు. జైభీమ్ సినిమా పేరు పెట్టి పక్కన బ్రోకెన్ హార్ట్ ఏమోజీని పెట్టాడు.

హీరో నాని జాతీయ అవార్డుల్లో జైభీమ్ కు స్థానం దక్కక పోవడంపై తన బాధ, నిరాశ, అసహనాన్ని నాని వెల్లిబుచ్చాడు. అయితే అల్లు అర్జున్ కు అవార్డు దక్కడంపై నాని ఎక్కడా అసహనాన్ని వ్యక్త పరచినట్లుగా లేదు. అసలు ఏ కేటగిరీలోనూ జైభీమ్ సినిమాకు అవార్డు దక్కకపోవడంపైనే నాని అసహనం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. కానీ, నాని పోస్టును చూసి చాలా నెగిటివ్ గా తీసుకుని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు అవార్డు దక్కడంపై కుళ్లుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎక్కడా నాని పోస్టులా కనిపించడం లేదంటూ కొందరు నానికి మద్దతుగా నిలుస్తున్నారు.

I am sad that the award did not come! 2

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş