iDreamPost
android-app
ios-app

గ్రాండ్‌గా దిల్‌ రాజు కొడుకు ఫస్ట్‌ బర్త్‌డే వేడుక.. వందల మంది అతిథుల సమక్షంలో!

  • Published Jun 29, 2023 | 5:41 PM Updated Updated Jun 29, 2023 | 5:41 PM
  • Published Jun 29, 2023 | 5:41 PMUpdated Jun 29, 2023 | 5:41 PM
గ్రాండ్‌గా దిల్‌ రాజు కొడుకు ఫస్ట్‌ బర్త్‌డే వేడుక.. వందల మంది అతిథుల సమక్షంలో!

టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు దిల్‌ రాజు. కథ నచ్చితే చాలు.. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్న తేడా చూడడు. కొత్త​ వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో కూడా ముందుంటాడు దిల్‌ రాజు. కేవలం టాలీవుడ్‌లోనే కాక సౌత్‌లోనే టాప్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు దిల్‌ రాజు. తెలుగులోనే కాక తమిళ్‌, హిందీ భాషల్లో.. అది కూడా ప్రెస్టిజీయస్‌ ప్రాజెక్ట్స్‌కి నిర్మాతగా వ్యవహరిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు దిల్‌ రాజు. మొదటి భార్య మృతి చెందడంతో.. మూడు సంవత్సరాల క్రితం దిల్‌ రాజు రెండో వివాహం చేసుకున్నాడు. గతేడాది వీరికి కుమారుడు జన్మించాడు. అన్వీ అని పేరు పెట్టారు. నేడు దిల్‌ రాజు వారసుడు అన్వీ పుట్టిన రోజు. ఈ క్రమంలో ఫిల్మ్‌ నగర్‌లో ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. కొడుకు ఫస్ట్‌ బర్త్‌డేని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారట దిల్‌ రాజు.

ఈ రోజు అనగా జూన్‌ 29 సాయంత్ర.. అన్వీ రెడ్డి బర్త్‌డేని.. అంగరంగ వైభవంగా చేయనున్నారట. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీకి చెందిన టాప్‌ సెలబ్రిటీలంతా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు సినిమా పరిశ్రమ నుంచే కాక.. అన్ని ఇండస్ట్రీల నుంచి మొత్తం 650 మంది సెలబ్రిటీలను తన కొడుకు అన్వీ మొదటి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించారట దిల్ రాజు. ఈ బర్త్‌డే వేడుకకు టాలీవుడ్‌కు చెందిన అందరూ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు హాజరవుతారని తెలుస్తోంది. అయితే కొడుకు బర్త్‌డే వేడుకులకు సంబంధించి దిల్ రాజు వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సెలబ్రేషన్స్ తరవాత మీడియాకు కంటెంట్ విడుదల చేస్తారని అంటున్నారు.

నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత. ఆమె సుమారు 6 సంవత్సరాల క్రితం అనగా 2017లో గుండెపోటుతో మృతి చెందారు. దిల్ రాజు-అనిత దంపతులకు హన్షితారెడ్డి అనే కుమార్తె ఉంది. మొదటి భార్య మృతి చెందడానికి ముందే.. ఆమెకు వివాహం జరిగింది. తాను వివాహం చేసుకుని వేరే ఇంటికి వెళ్లడం.. తల్లి మృతి చెందడంతో.. తండ్రి ఒంటరిగా ఉంటారని భావించి రెండో వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు దిల్‌ రాజు కుమార్తె. ఈ క్రమంలో కోవిడ్ టైమ్‌లో 2020లో వైఘా రెడ్డిని దిల్ రాజుకిచ్చి రెండో వివాహం చేశారు. వీరికి వివాహమైన రెండేళ్ల తర్వాత అనగా  2022 జూన్ 29న అన్వీ రెడ్డి జన్మించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దిల్‌ రాజు చేతి నిండా పలు ప్రెస్టీజియస్‌ ప్రాజక్ట్‌లు ఉన్నాయి. వాటిలో శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి వస్తోన్న 50వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా గురించి రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş