iDreamPost
iDreamPost
టాలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్ గా రికార్డు అవుతుందనే అంచనాలు మోసిన రాధే శ్యామ్ ఆ ఫీట్ ని సాధించలేకపోయింది. అయినా కూడా టాక్ తో నిమిత్తం లేకుండా చాలా చోట్ల గ్రాండ్ ఫిగర్స్ నమోదయ్యాయి. నార్త్ లో నిరాశపరచగా కేరళలో మరీ తక్కువగా కలెక్షన్లు నమోదయ్యాయి. పోటీ ఏదీ లేకపోయినా కూడా ఆ అడ్వాటేంజ్ ని పూర్తిగా వాడుకోలేక తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల పోరాటం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 38 కోట్ల దాకా షేర్ రాబట్టిన రాధే శ్యామ్ టార్గెట్ చాలా పెద్దది. థియేట్రికల్ బిజినెస్ 204 కోట్ల దాకా జరగడంతో ఇప్పుడది కొండంతగా కనిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.
కేవలం ఏపి తెలంగాణ నుంచే అధిక భాగం రావాల్సి ఉన్నా ఇందులో ఎంతమేరకు రాధే శ్యామ్ రిటర్న్ ఇస్తుందనేది వేచి చూడాలి. ముఖ్యంగా నైజాం నుంచి ట్రేడ్ అధికంగా ఆశిస్తోంది. ఇప్పటికే 11 కోట్ల దగ్గరకు అక్కడ షేర్ రాబట్టి సంచలనం రేపిన ఈ సినిమా ఇవాళ రేపు కూడా వీకెండ్ అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడుకోనుంది. అయితే బిసి సెంటర్స్ లో మౌత్ టాక్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో మాస్ దూరంగా ఉంటున్నారు. కర్ణాటకలో కొంత మెరుగ్గా ఉండగా ఈటి పోటీ వల్ల తమిళనాడులో దెబ్బ పడింది. ఓవర్సీస్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేసినట్టే భారీగా రాబట్టుకుంది. ఏరియాల వారిగా చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి
నైజామ్ – 10 కోట్ల 80 లక్షలు
సీడెడ్ – 3 కోట్ల 45 లక్షలు
ఉత్తరాంధ్ర – 1 కోటి 90 లక్షలు
ఈస్ట్ గోదావరి – 2 కోట్ల 60 లక్షలు
వెస్ట్ గోదావరి – 2 కోట్లు
గుంటూరు – 2 కోట్ల 58 లక్షలు
కృష్ణా – 95 లక్షలు
నెల్లూరు – 1 కోటి 5 లక్షలు
ఏపి తెలంగాణ మొదటి రోజు షేర్ – 25 కోట్ల 35 లక్షలు
కర్ణాటక – 2 కోట్ల 70 లక్షలు
తమిళనాడు – 30 లక్షలు
కేరళ – 8 లక్షలు
హిందీ – 2 కోట్ల 25 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 80 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే షేర్ – 38 కోట్ల 24 లక్షలు
ఇంకా 160 కోట్ల షేర్ రావడం అంటే మాటలు కాదు. కనీసం వారం పది రోజులు ఒకే స్ట్రాంగ్ రన్ కంటిన్యూ చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. పెద్దగా హైప్ ని కాశ్మీర్ ఫైల్స్ అతి తక్కువ థియేటర్లలో రిలీజైనా రాధే శ్యామ్ కన్నా ఎక్కువగా కొన్ని కేంద్రాల్లో షేర్ రాబట్టడం ఆందోళన కలిగించే విషయం. మరి ఈ గండాన్ని ఎలా దాటుతుందో వేచి చూడాలి. టీమ్ ప్రమోషన్లను మళ్ళీ పెంచింది. తమన్ ఒక్కడే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 16 ట్వీట్లు పెట్టడం గతంలో ఎన్నడూ చూడనిది. ఇవాళ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ప్రెస్ మీట్ చేయడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యువి ప్లానింగ్ లో తగ్గడం లేదని
Also Read : Radhe Shyam : తీసేసిన సన్నివేశాలే దెబ్బ కొట్టాయా