iDreamPost
android-app
ios-app

వీడియో: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు గమనించారా?

  • Published Aug 31, 2023 | 8:16 PM Updated Updated Aug 31, 2023 | 8:16 PM
  • Published Aug 31, 2023 | 8:16 PMUpdated Aug 31, 2023 | 8:16 PM
వీడియో: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు గమనించారా?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. చెల్లెళ్లు ఇద్దరూ మెగాస్టార్ ఇంటికి వచ్చి రాఖీ కట్టారు. అందుకు సంబంధించిన వీడియో చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా ఆ వీడియో చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పోస్ట్ కు లైకులు కొట్టడమే కాకుండా.. విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో బాగా గమనిస్తే చిరంజీవి పూజగదిలో ఓ ఇద్దరు ఫొటోలు ఉన్నాయి. అవి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించారా?

ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే.. అతనికి కచ్చితంగా సహాయ సహకారాలు అందిచిన వ్యక్తులు ఉండే ఉంటారు. చాలామంది తమ ఎదుగుదలకు ఉపయోగపడిన వారిని మర్చిపోవచ్చు. ఎక్కడి నుంచి మనం ఈ స్థాయికి వచ్చాం అనే విషయాన్ని గుర్తుంచుకోకపోవచ్చు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం అలా చేయలేదు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయిన తన తండ్రి కొణిదెల వెంకట్రావ్, మామయ్య అల్లు రామలింగయ్య ఫొటోలను తన పూజగదిలో పెట్టుకున్నారు. దేవుళ్లకు ఎలా అయితే పూజ చేసుకుంటారో.. తన తండ్రి- మామలకు అలాగే నిత్యం పూజలు చేస్తున్నారు. రాఖీ సందర్భంగా పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Photos of the two in Chiranjeevi's pooja! 2

మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితంగా ఉండేవారికి ఈ విషయం తెలిసి ఉండచ్చు. కానీ, ఆయన అభిమానులకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఈ వీడియో చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అంతా చిరంజీవి తన తండ్రి- మామకు ఇస్తున్న గౌరవం, వారికి ఇచ్చిన స్థానం చూసి మురిసిపోతున్నారు. ఈ వీడియో షేర్ చేసి తమ అభిమాన హీరో అంటే ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే భోళా శంకర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండు ప్రాజెక్టులు చేయబోతున్నారు. పుట్టినరోజు సందర్భంగా వాటి అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కుమార్తె సుస్మితతో ఒక సినిమా చేయబోతున్నారు. అలాగే బింబిసార డైరెక్టర్ వశిష్టతో చిరు 157 సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పంచభూతాల నేపథ్యంలో సాగే సినిమాగా చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet