నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మహేష్ బాబు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అదీకాక నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి కోసం సోమవారం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించింది చిత్ర యూనిట్. మరి ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విడుదలకు ముందే మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు చిత్ర యూనిట్. సినిమాను చూసిన మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశసించాడు. అనంతరం హీరో నవీన్ పోలిశెట్టిని, డైరెక్టర్ మహేష్ బాబును ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు మెగాస్టార్. మరి మెగాస్టార్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ చూశాను మెుదటి నుంచి చివరిదాక హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనలని ప్రతిబింబించే విధంగా ఉంది. సరికొత్త కథాంశంతో మరోసారి నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు కంటే రెట్టింపు ఎనర్జీతో వినోదాన్ని పంచాడు. మనందరి దేవసేన ఎంతో అందంగా, అద్భుతంగా నటించి ఈ చిత్రానికి ప్రాణం పోసింది అనుష్క. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ మహేష్ బాబును అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడిని నేనే. మరోసారి ప్రేక్షకులతో కలిసి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలని నాకు కోరిక కలిగింది” అంటూ మూవీ టీమ్ ను ప్రశంసలతో ముంచెత్తారు మెగాస్టార్.
ఇక మెగాస్టార్ ఇచ్చిన పాజిటీవ్ రివ్యూతో ఫుల్ ఖుషిగా ఉంది మూవీ టీమ్. నవీన్ పోలిశెట్టిని, డైరెక్టర్ ను ఇంటికి పిలిపించుకుని మీర అభినందించారు మెగాస్టార్. 100 శాతం ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. మరి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై చిరంజీవి రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023