iDreamPost
android-app
ios-app

సడన్​గా షాకిచ్చిన బిగ్​బాస్ బ్యూటీ.. భర్తతో విడిపోయానంటూ..!

  • Author singhj Published - 07:02 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 07:02 PM, Sat - 29 July 23
సడన్​గా షాకిచ్చిన బిగ్​బాస్ బ్యూటీ.. భర్తతో విడిపోయానంటూ..!

టెలివిజన్ చరిత్రలో బిగ్​బాస్ షో పెద్ద సంచలనమనే చెప్పాలి. ఈ షో కాన్సెప్ట్​ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అదే టైమ్​లో దీన్ని ఇష్టపడేవారు, చూసేవారి​ సంఖ్య కూడా పెరిగింది. టీఆర్పీల పరంగానూ బిగ్​బాస్ దూసుకుపోతోంది. ఒక్క తెలుగే కాదు తమిళం, కన్నడ, హిందీల్లోనూ బిగ్​బాస్​ షోను నిర్వహిస్తున్నారు. ఆయా భాషల్లో అక్కడి స్టార్ హీరోలు ఈ షోను హోస్ట్‌ చేస్తుండటం గమనార్హం. బిగ్​బాస్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు కన్నడ యాంకర్, నటి చైత్రా వాసుదేవన్. కన్నడ బిగ్​బాస్ షో ద్వారా ఆమె క్రేజ్ పెరిగింది.

యాంకర్​గా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న చైత్రా వాసుదేవన్.. బిగ్​బాస్ షో ద్వారా తన క్రేజ్​ను మరింత పెంచుకున్నారు. అలాంటి చైత్ర కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన భర్తతో విడిపోతున్నట్లు ఆమె ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చైత్ర వెల్లడించారు. ఎన్నో నెలలు ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పేందుకు సిద్ధమయ్యానని ఆమె తెలిపారు. సత్య, తాను విడిపోయామని.. తమ విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు చైత్ర. తమ గురించి చెడుగా మాట్లాడొద్దని కోరారు.

ఎవరి మీదా ద్వేషం చూపించొద్దన్నారు చైత్రా వాసుదేవన్. తమను జడ్జ్ చేయొద్దని.. దీని నుంచి బయటపడేందుకు చాలా టైమ్ పడుతోందన్నారు. లైఫ్​లో ముందుకు వెళ్లాలంటే ముందు తాను తన ప్రొఫెషన్​లో తలమునకలయ్యేంత బిజీగా మారాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. టెలివిజన్ రంగంలో చాన్నాళ్లుగా పనిచేస్తున్నానని.. ఇక మీదటా అక్కడే కొనసాగాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. అందుకే అభిమానుల ప్రేమాభిమానాలు కావాలని చైత్ర ఇన్​స్టాగ్రామ్​లో రాసుకొచ్చారు. కాగా, 2017లో సత్య నాయుడు అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడారు. ఎప్పుడూ అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chaitra Vasudevan (@chaitra_vasudevan_official_)