iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన భోళా శంకర్ నిర్మాత!

  • Author Soma Sekhar Published - 10:06 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 10:06 PM, Thu - 17 August 23
మెగాస్టార్ తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన భోళా శంకర్ నిర్మాత!

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ భోళా శంకర్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వేదాళం మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో ఇటు మెగాస్టార్ పై అటు మెహర్ రమేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా.. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవికి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాత అనిల్ సుంకర తన ఇల్లు, తోటలు అమ్ముకున్నాడన్న వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు నిర్మాత అనిల్ సుంకర.

భోళా శంకర్ సినిమా కోసం రెమ్యూనరేషన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి పట్టుబట్టడంతో.. నిర్మాత తన ఇల్లు, తోటలను అమ్ముకోవాల్సి వచ్చిదన్న వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇప్పటికే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది కూడా. అయినప్పటికీ ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీంతో స్వయంగా రంగంలోకి దిగాడు భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర. చిరంజీవితో వివాదం అన్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

“కొంత మందికి సోషల్ మీడియాలో వచ్చే కొన్ని రూమర్స్ ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ కష్టపడి పైకి వచ్చిన వారి ప్రతిష్టను దెబ్బతీయడం నేరం. ఇలాంటి వార్తలు వారి కుటుంబాల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తాయి. ఇక నాకు చిరంజీవికి మధ్య వివాదం నెలకొందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వ్యక్తిగతంగా మా మధ్య మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ మాకు అన్ని విధాల సహకరించే వ్యక్తి. నేను ఇల్లు, పొలాలు, తొటలు అమ్ముకున్నాను అన్న వార్తలు అవాస్తవం. దయచేసి విద్వేషపూరిత వార్తలను ప్రచారం చేయకండి. ఇక ఈ విషయంలో నా శ్రేయస్సు కోరిన ఇండస్ట్రీ మిత్రులకు నా ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ నోట్ రాసుకొచ్చారు. దీంతో కొద్దిరోజులుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు అనిల్ సుంకర.


ఇదికూడా చదవండి: OTTలో భోళా శంకర్ కు భారీ ధర! ఇదీ మెగాస్టార్ రేంజ్!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş