సెలబ్రిటీలపై, రాజకీయ నాయకులపై ఏదో ఒక సందర్భంలో పోలీసులు కేసులు నమోదు అవుతూ ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలపై పోలీసు కేసు నమోదు అవ్వడం చాలా అరుదైన విషయం. కానీ పొలిటికల్ లీడర్స్ పై తరచుగా కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై గతంలో నమోదు అయిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాంతో ఎన్నో సంవత్సరాలుగా పోలీసు కేసును ఎదుర్కొంటున్న మెగాస్టార్ కు ఈ కేసు నుంచి ఊరట లభించింది. అసలు మెగాస్టార్ పై నమోదు అయిన కేసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా, నెంబర్ వన్ హీరోగా తెలుగు తెరపై తనదైన ముద్రను వేశారు. రాజకీయల నుంచి తప్పుకున్నాక ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు మెగాస్టార్. ఈ క్రమంలోనే మెగాస్టార్ కు ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవిపై గుంటూరు లో ఓ కేసు నమోదు అయ్యింది. 2014 ఎలక్షన్స్ టైమ్ లో కాంగ్రెస్ నేతగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నిర్ణీత సమయంలో సమావేశాన్ని పూర్తి చేయకపోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దాంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని గుంటూరులో చిరంజీవిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మెగాస్టార్. ఆయన పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో మెగాస్టార్ కు ఊరట లభించినట్లు అయ్యింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టారు మెగాస్టార్.
ఇదికూడా చదవండి: ఆ ఒక్క కారణంతో చాలా సినిమాలు వదులుకున్నా: మీనాక్షి చౌదరి