iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క కారణంతో చాలా సినిమాలు వదులుకున్నా: మీనాక్షి చౌదరి

  • Author Soma Sekhar Updated - 05:36 PM, Thu - 4 January 24
  • Author Soma Sekhar Updated - 05:36 PM, Thu - 4 January 24
ఆ ఒక్క కారణంతో చాలా సినిమాలు వదులుకున్నా: మీనాక్షి చౌదరి

సాధారణంగా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్స్ నియమాలు ఏమీ పెట్టుకోరు. సినిమాలో ఛాన్స్ వస్తే చాలు తమ టాలెంట్ ఏంటో చూపించుకోవాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. ఇక కొంత మంది తారలు తమకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా ఇండస్ట్రీలో ఇలాగే ఉండాలని కొన్ని నియమ, నిబంధనలు పెట్టుకుంటారు. వాటి కారణంగా కెరీర్ లో చాలా సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. తాజాగా నేను కూడా ఆ ఒక్క కారణంతో ఎన్నో సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ‘గుంటూరు కారం’ హీరోయిన్ మీనాక్షి చౌదరి. మరి ఏ కారణంతో ఈ అమ్మడు చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీనాక్షి చౌదరి.. సుమంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత హిట్ 2 సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో అనుకోకుండా అవకాశాన్ని దక్కించుకుంది మీనాక్షి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన విశేషాలను పంచుకుంది.

ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల తాను చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మీనాక్షి చెప్పుకొచ్చింది. సినిమాలో ఏదైనా సీన్ నాకు కంఫర్ట్ గా లేకపోతే.. దాన్ని నేను ముందుగానే అంగీకరించను అని తెలిపింది. అశ్లీల సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు మీనాక్షి తెలిపింది. అలాగే కథకు అవసరం అయితేనే తప్ప ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని నియమం పెట్టుకున్నట్లు ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ భామ. ఈ నియమంతో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

ఇక కెరీర్ లో విభిన్న పాత్రల్లో నటించాలని, కొత్త తరహా పాత్రలు వస్తే నటించడానికి వెనకాడనని, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలు చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు, విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ సరసన మీనాక్షి నటిస్తోంది. కాగా.. మీనాక్షి పెట్టుకున్న ఈ నియమాల కారణంగా కెరీర్ లో ఇంకెన్ని సినిమాలు వదులుకోవాల్సి వస్తుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీనాక్షి చౌదరి పెట్టుకున్న నియమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అనిరుధ్, లోకేష్ కనగరాజ్ హీరోలుగా సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş