iDreamPost

అక్కాచెల్లెళ్ల అనుబంధం.. కానీ ఆ ఒక్క కారణంతో దూరమయ్యారు

అక్కాచెల్లెళ్ల అనుబంధం.. కానీ ఆ ఒక్క కారణంతో దూరమయ్యారు

దక్షిణాది పరిశ్రమలోనే కాదూ బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన నటి శ్రీదేవి. టాలీవుడ్ అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ నటి అనడంలో అతిశయోక్తి కాదు. చిన్న వయస్సులో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందం.. పెళ్లి వరకు వెండి తెర రారాణిగా రాణించింది. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుని, ఇల్లాలుగా మారిపోయింది. పూర్తిగా సినిమాలకు దూరమైన ఆమె.. దాదాపు 15 ఏళ్లకు ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రీ ఎంట్రీ తర్వాత కూడా తన నటనలోని ఛామింగ్ ఏమాత్రం మిస్ కాలేదు ప్రేక్షకులు. ఆ తర్వాత పులి, మామ్ వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే రీ ఎంట్రీ అయిన కొన్నాళ్లకే ఆమె ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయి.. సినీ ప్రేక్షకుల హృదయాలను ముక్కలు చేసింది. చాలా మంది హాట్ ఫేవరేట్ అయిన  శ్రీదేవి  మరణించిందంటే అభిమానితో సహా సగటు ప్రేక్షకుడు కూడా జీర్ణించుకోలేపోయాడు. కానీ ఆమె సొంత సోదరి మాత్రం కనీసం కడచూపుకు కూడా రాలేదు. ఏంటీ శ్రీదేవి మాత్రమే తెలుసు.. ఆమెకు సోదరి కూడా ఉందన్న అనుమానం వస్తుంది కదా..నిజం ఆమె పేరు శ్రీలత.
 ఓ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పుడితే.. బొమ్మల నుండి బట్టల వరకు ప్రతిదానిలో గొడవలు జరుగుతుంటాయి. కానీ వారిద్దరూ పెళ్లిళ్ల పేరుతో దూరమైతే ప్రేమలు పెరుగుతాయి.  శ్రీదేవి విషయంలో రివర్స్ అయ్యింది ఈ బాంధవ్యం. తమిళనాడులోని మీనం పట్టి గ్రామానికి చెందిన రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారి పెద్ద కుమార్తె మన అందాల రాశి శ్రీదేవి. చిన్న కుమార్తె శ్రీలత. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేసింది శ్రీదేవి. కానీ ఆమె సోదరి శ్రీలత మాత్రం సినిమాల్లో ప్రయత్నించలేదు. అయితే అక్క వెంట అమ్మతో పాటు షూటింగ్స్ వెళ్లేవారు చెల్లెలు  శ్రీలత. దాదాపు 21 ఏళ్ల పాటు ఆమెతో సన్నిహితంగా మెలిగింది. ఆమెకొక స్నేహితురాలు అయ్యింది.  శ్రీలతను కూడా హీరోయిన్ చేద్దామని అనుకోగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. శ్రీదేవికి మేనేజర్‌గా వ్యవహరించింది. అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం.. వీరిద్దరి మధ్య దూరాలను పెంచింది.  శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. ఆమెకు తప్పుడు ట్రీట్ మెంట్ చేయడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోయింది.  1996లో ఆమె మరణించింది. డాక్టర్ల తప్పు వల్లే తన తల్లి చనిపోయిందంటూ ఆసుప్రతిపై కేసు పెట్టింది శ్రీదేవి.
ఆ కేసులో శ్రీదేవి గెలిచి.. నష్టపరిహారం కింద రూ. 7.2 కోట్లను పొందింది. అయితే ఆ పరిహారంలో శ్రీలతకు కూడా వాటా ఉండగా.. మొత్తం శ్రీదేవి తీసుకున్నట్లు శ్రీలత ఆరోపించింది. ఈ డబ్బు విషయంలోనే వీరి మధ్య విబేధాలు మొదలయ్యాయని సమాచారం. అంతేకాకుండా ఆస్తి విషయంలోనూ శ్రీలత తన వాటా కోసం అక్క శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే తన ఆస్తి మొత్తాన్ని అక్క పేరిట బదిలీ చేసిందని ఆరోపించింది. ఈ కేసులో శ్రీలత అక్కపై గెలిచి తన వాటా కింద రూ. 2 కోట్లను దక్కించుకుంది. డబ్బు వీరిద్దరి బాంధ్యవాన్ని చెరిపేసింది. మాటలు కరువయ్యాయి. వీరిద్దరినీ కలిపేందుకు శ్రీదేవి భర్త బోనీకపూర్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే వీరూ మాట్లాడుకోలేదు. 2018 ఫిబ్రవరిలో దుబాయ్ హోటల్ లో శ్రీదేవి మరణించిన సంగతి విదితమే. అయితే అక్క మరణించినా కూడా కడసారి చూపుకు రాలేదని తెలుస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేసిన స్మారకోత్సవానికి కూడా ఆమె గైర్హాజరు అయ్యింది. సుమారు 300 చిత్రాల్లో నటించిన ఆమె.. తన కుమార్తె జాన్వీని తెరపై చూసుకోకుండానే కన్నుమూసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి