టాలీవుడ్ లో కొంతకాలంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర. అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో వీరి జంట చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు పర్సనల్ లైఫ్ పరంగా వివాదాలు ఫేస్ చేస్తూనే.. రీసెంట్ గా ఇద్దరూ జంటగా ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా చేశారు. గత నెలలో థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా.. జూన్ 23న ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటిటిలలో స్ట్రీమింగ్ మొదలైంది. సరే అంతా బాగానే వెళ్తోందిగా అనుకుంటున్న టైంలో ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్.. తాజాగా మళ్లీ పెళ్లికి షాకిచ్చింది. ఈ సినిమాను తమ ఓటిటి నుండి డిలీట్ చేసింది.
మరి నరేష్, పవిత్ర ఎంతో ఈజ్ తో నటించి, ప్రమోట్ చేసిన మళ్లీ పెళ్లి మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఎందుకు తొలగించారు? ఆ వివరాల్లోకి వెళ్తే.. చట్టపరమైన ఇబ్బందులేనని కారణాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. తమ పరువుకు భంగం కలిగించేలా మూవీ తీశారని, వెంటనే ఓటిటి స్ట్రీమింగ్ ఆపేయాలని కోర్టులో కేసు వేసిందట. ఈ కేసు నుండి ఎలాంటి ఉత్తర్వులు రాకముందే అమెజాన్ ప్రైమ్ వారు మూవీని తొలగించడం గమనార్హం. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న అన్ని భాషలలో సినిమా ఆగిపోయింది.
ఇదిలా ఉండగా.. నరేష్ భార్య రమ్య రఘుపతి గతంలో కూడా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయకూడదని కోర్టును ఆశ్రయించింది. కానీ.. అప్పుడు కోరిక ఫలించలేదు. అయితే.. మళ్లీ పెళ్లి మూవీని నరేష్, పవిత్రల పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించారు డైరెక్టర్ ఎంఎస్ రాజు. అయితే.. ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ జరుగుతున్న టైంలో నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇక రిస్క్ ఎందుకని అమెజాన్ ప్రైమ్ వారు మంచి వ్యూస్ వస్తున్న మూవీని అర్ధాంతరంగా తొలగించారు. పైగా ఈ సినిమాని విజయ్ కృష్ణ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించడం విశేషం. మరి నరేష్-పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.