iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? బన్నీకి ఏమాత్రం తీసిపోదు..

  • Author Soma Sekhar Published - 05:09 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Published - 05:09 PM, Sat - 5 August 23
అల్లు అర్జున్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? బన్నీకి ఏమాత్రం తీసిపోదు..

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ను తెలుసుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు సగటు సినీ అభిమానులు. హీరోలు సినిమాలతో పాటుగా ఏం చేస్తుంటారు? వారి భార్యలు ఏమైనా బిజినెస్ చేస్తుంటారా? లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు స్నేహారెడ్డి. ఆమె గతంలోనే ఓ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. మరి స్నేహారెడ్డి చేస్తున్న బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సొంతంగా ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది స్నేహారెడ్డి. ఇన్ స్టాగ్రామ్ లో తన పిల్లల ఫోటోలతో పాటుగా రీల్స్ చేస్తూ.. అభిమానులను సంపాదించుకుంది స్నేహారెడ్డి. ఇక ఈమె 2016లో సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్ లైన్ ఫోటో స్టూడియోను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక ఈ కంపెనీ ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్ ఎడిషన్ కోసం స్నేహారెడ్డి ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది.

కాగా.. ఈ ఈవెంట్ లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డిజైనర్ బ్రాండ్స్ సందడి చేశాయి. ప్రత్యేకంగా మామ్ అండ్ కిడ్స్ కోసం స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి చేశారు. స్నేహారెడ్డి స్టాల్స్ యజమానులతో సరదాగా ముచ్చటించింది. పిల్లలతో కలిసి బన్నీ ఈవెంట్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తన భార్య బిజినెస్ ను సపోర్ట్ చేయడానికి బన్నీ రావడంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బన్నీ సంపాదనకు ఏమాత్రం తీసిపోని విధంగా స్నేహారెడ్డి సంపాదిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇదికూడా చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. సలార్ పై ప్రభాస్ కీలక నిర్ణయం! ఆ విషయంలో..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş