iDreamPost

‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. సలార్ పై ప్రభాస్ కీలక నిర్ణయం! ఆ విషయంలో..

  • Author Soma Sekhar Published - 03:30 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Published - 03:30 PM, Sat - 5 August 23
‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. సలార్ పై ప్రభాస్ కీలక నిర్ణయం! ఆ విషయంలో..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఇక ‘ప్రాజెక్ట్ కె’ మూవీతో హాలీవుడ్ గోడలు బద్దలు కొడదానికి రెడీ అయ్యాడు డార్లింగ్. కానీ గత కొంత కాలంగా ప్రభాస్ కు సరైన హిట్ లేదు. బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ డార్లింగ్ ఖాతాలో లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అదీకాక ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో ఆడకపోగా.. వివాదాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా ఎఫెక్ట్ కారణంగా.. సలార్ మూవీపై ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘సలార్’, ప్రాజెక్ట్ కె.. ఈ రెండు సినిమాల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కాగా.. సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సలార్ మూవీపై ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదిపురుష్ ఎఫెక్ట్ కారణంగా డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది యూవీ క్రియేషన్స్. ఈ చిత్రంతో తన సోదరుడు ప్రమోద్ కు లబ్ది చేకూర్చాలని భావించాడు ప్రభాస్. కానీ అది బెడిసి కొట్టింది. ఇక ఆదిపురుష్ ఎఫెక్ట్ యూవీ క్రియేషన్స్ పై భారీగా పడింది.

ఈ నేపథ్యంలో సలార్ పై ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే? ‘సలార్’ మూవీ బిజినెస్ విషయంలో తలదూర్చకూడదని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే సలార్ నాన్ థియేట్రికల్స్ బిజినెస్ తో పాటుగా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 200 కోట్లకు సలార్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇక తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం రెండు పెద్ద బ్యానర్లు పోటీ పడుతున్నాయి.

కాగా.. ఇంత భారీ ఎత్తున బజ్ ఉన్నప్పటికీ ప్రభాస్ సినిమా బిజినెస్ విషయంలో దూరంగా ఉంటున్నారట. సలార్ కోసం కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారట. ఇక ఈ సినిమాకు డార్లింగ్ దాదాపు రూ. 100 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడని సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి సలార్ బిజినెస్ విషయంలో ప్రభాస్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ముచ్చటగా మూడోసారి మెగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి