iDreamPost
android-app
ios-app

Video: బన్నీ గారాలపట్టీకి భక్తి ఎక్కువే.. గణపతి పూజ ఎంత శ్రద్ధగా చేస్తుందో చూడండి!

  • Published Sep 07, 2024 | 1:08 PM Updated Updated Sep 07, 2024 | 1:08 PM

Allu Arha: అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముద్దు ముద్దు మాటలతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. వినాయక చవితి సందర్భంగా అర్హ తన ఇంట్లో వినాయకుడి పూజ చేసింది. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన గారాల పట్టి పూజ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.

Allu Arha: అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముద్దు ముద్దు మాటలతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. వినాయక చవితి సందర్భంగా అర్హ తన ఇంట్లో వినాయకుడి పూజ చేసింది. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన గారాల పట్టి పూజ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.

  • Published Sep 07, 2024 | 1:08 PMUpdated Sep 07, 2024 | 1:08 PM
Video: బన్నీ గారాలపట్టీకి భక్తి ఎక్కువే.. గణపతి పూజ ఎంత శ్రద్ధగా చేస్తుందో చూడండి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన క్యూట్ నెస్ తో ముద్దు ముద్దు మాటలతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. అల్లు అర్జున్ తరచుగా అర్హ క్యూట్ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. దాంతో అల్లు అర్హ కూడా క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకు సంబంధించి ఏ వీడియో వచ్చినా కూడా వైరల్ అయిపోతుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన శాకుంతలం మూవీ ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చింది అర్హ. ఆ సినిమాలో భరతుడు పాత్రలో నటించింది. తన ముద్దు ముద్దు మాటలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక నేడు (సెప్టెంబర్ 7) వినాయక చవితి సందర్భంగా అర్హ మరోసారి వైరల్ అవుతుంది. తన ఇంట్లో వినాయకుడి పూజ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన గారాల పట్టి పూజ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోని అల్లు అర్జున్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి అర్హని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు బన్నీ అభిమానులు. ఈ వీడియోని లైక్ కొడుతూ తెగ షేర్ చేస్తున్నారు. ఇలా పండగ రోజున తన గారాల పట్టి పూజ చేస్తున్న వీడియోని షేర్ చేసి అభిమానులని ఖుషి చేశారు బన్నీ.

ఇక ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక డిసెంబర్ 6న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక అల్లు అర్హ పూజ చేస్తున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet