Allu Arjun : ఐకాన్ స్టార్ పాన్ ఇండియా ప్లాన్స్

నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో భేటీ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2కు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడీ మీటింగ్ చేయడం పట్ల రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయనతో బన్నీ ఏదైనా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారా అనే కోణంలో విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేది లేదని, భవిష్యత్తులో ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు కానీ ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్పాలి. ఈ చర్చ అయ్యాక అనిమల్ షూటింగ్ కోసం నగరంలోనే ఉంటున్న సందీప్ రెడ్డి వంగాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒకవేళ భన్సాలీకి చేయాలని ఉన్నా గంగూబాయ్ కటియావాడి తర్వాత రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసుకున్న బైజు బవ్రాని పూర్తి చేయాలి. ఇది ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా. గోలీయోన్ కి రస్లీలా, బాజీరావు మస్తానీ, పద్మవత్ తర్వాత మళ్ళీ చేతులు కలిపారు. దీనికి ఎంతలేదన్నా కనీసం రెండు మూడేళ్ళ సమయం పడుతుంది. అప్పటిదాకా బన్నీ వెయిట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి  ఆలోగా ఓ రెండు సినిమాలు పూర్తి చేయొచ్చు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరోల పొటెన్షియాలిటీ చూశాక హిందీ దర్శకులు మనవాళ్ళతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వందల కోట్ల మార్కెట్ కళ్ళముందు కనిపిస్తోందిగా.

పుష్ప పార్ట్ 1 నార్త్ లో సాధించిన విజయం చూశాక బన్నీ తనకొచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. పుష్ప 2 దానికి మించి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమా హిందీలోనూ వెళ్తుంది. ఏదీ అంచనాలకు తగ్గినా సమస్య అవుతుంది. ప్రభాస్ తర్వాత అక్కడి థియేట్రికల్ బిజినెస్ లో తనే ఉండాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్న అల్లు అర్జున్ కి టైం ఎలా కలిసి వస్తుందో చూడాలి. ఒకప్పుడు చిరంజీవి నాగార్జున లాంటి స్టార్లు గట్టిగా పాతలేకపోయిన మన జెండా ఇప్పటి జెనరేషన్ హీరోలు విజయవంతంగా చేయడం గొప్ప పరిణామం. దీన్ని నిలబెట్టుకోవడమే కావాలి

Also Read : Krithi Shetty : ఉప్పెన భామకు అవకాశాల వెల్లువ

Show comments