iDreamPost
android-app
ios-app

లావణ్య త్రిపాఠిపై అల్లు అరవింద్‌ కామెంట్స్‌!

  • Published Jul 13, 2023 | 2:04 PM Updated Updated Jul 13, 2023 | 2:04 PM
  • Published Jul 13, 2023 | 2:04 PMUpdated Jul 13, 2023 | 2:04 PM
లావణ్య త్రిపాఠిపై అల్లు అరవింద్‌ కామెంట్స్‌!

హీరో వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠిలు కొన్ని రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకరంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘చావు కబురు చల్లగా’ సినిమా టైంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ లావణ్యపై చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ‘చావు కబురు చల్లగా’ ఈవెంట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘ ఎక్కడో నార్త్‌ ఇండియానుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తోంది. ఇక్కడే ఓ కుర్రాడ్ని చూసుకుని, పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోతే బాగుంటుంది కదా ఈ అమ్మాయి’ అని అన్నారు.

అల్లు అరవింద్‌ సరదాగా అన్నా లావణ్య మాత్రం ఆయన మాటల్ని సీరియస్‌గా తీసుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. మీడియాలో సైతం దీనిపై వార్తలు వచ్చాయి. ఈ కామెం‍ట్లపై అల్లు అరవింద్‌ తాజాగా, స్పందించారు. బేబీ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన లావణ్య త్రిపాఠి.. వరుణ్‌ తేజ్‌ల గురించి మాట్లాడుతూ.. ‘‘ దానికి ఇన్‌స్పైర్‌ అయి నువ్వు అప్పుడే పెళ్లి చేసుకోకమ్మా. నువ్వు బాగా పైకి రావాలి. అప్పుడు చూద్దాం. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోకు. చిన్న పిల్లవి.

నా బ్యానర్‌లో ఆమె రెండు,మూడు సినిమాలు చేసింది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఉండిపోవే అంటే.. ఆ అమ్మాయి దాన్ని సీరియస్‌గా తీసుకుని మా వాడ్నే ప్రేమించింది’’ అంటూ ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. కాగా, బేబీ సినిమా శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌లో రికార్డును సృష్టించింది.  మరి, అల్లు అరవింద్‌ తాజా కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio