iDreamPost
android-app
ios-app

బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ!

  • Author Soma Sekhar Published - 08:24 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Published - 08:24 PM, Sat - 5 August 23
బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ!

టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న పరమపదించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు పరిశ్రమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురికాగా.. ఇక కృష్ణ సొంత ఊరు అయిన బుర్రిపాలెం గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ అభిమాన నటుడి కోసం ఏమైనా చెయ్యాలని సంకల్పించుకున్నారు గ్రామస్థులు. అందులో భాగంగానే అభిమానులు, గ్రామస్థులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని తయ్యారు చేయించారు. తాజాగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం (ఆగస్టు 5)న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.

దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని బుర్రిపాలెంలో ఏర్పాటు చేశారు. అభిమానులు, గ్రామస్థులు కలిసి ఈ విగ్రహాన్ని తయ్యారు చేయించారు. అయితే గత కొంతకాలంగా విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు శనివారం(ఆగస్టు 5)న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణ కుటుంబ సభ్యులు కుమార్తె పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు విగ్రాహావిష్కరణలో పాల్గొన్నారు.

కాగా.. మహేష్ బాబు విదేశీ పర్యటనలో ఉన్నందున ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. అక్కడి నుంచి రాగానే గ్రామానికి వచ్చి కృష్ణ విగ్రహానికి నివాళులు అర్పిస్తారని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణపై ‘దేవుడు లాంటి మనిషి’ అన్న పుస్తకాన్ని రాశారు వినాయకరావు. ఈ కార్యక్రమంలోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్తె మంజూల మాట్లాడుతూ..”బుర్రిపాలెం అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఇక్కడికి ఎప్పుడు వెళ్తున్నారు? ఒక్కసారి వెళ్లిరండి అంటూ నాన్న మాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఇంత ప్రేమ, అభిమానానికి మేం దూరంగా ఉన్నామా? అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక నుంచి సంవత్సరంలో ఒక్కసారైనా ఇక్కడి వస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇదికూడా చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. సలార్ పై ప్రభాస్ కీలక నిర్ణయం! ఆ విషయంలో..

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio