iDreamPost

హర్ష సాయి పేదలను వాడుకుంటున్నాడు.. పెద్ద మాఫియా ఉంది: యూట్యూబర్ రవి

Youtuber Ravi On Harsha Sai: తెలుగు రాష్ట్రాల్లో హర్ష సాయి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ రాబిన్ హుడ్ లా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మంచి అనే ముసుగులో హర్ష సాయి పేదలను అడ్డుపెట్టుకుని మోసం చేస్తున్నాడని.. ఇతని వెనుక పెద్ద మాఫియా ఉందని.. ఇతనొక ఉ*గ్రవాదితో సమానమని ప్రముఖ యూట్యూబర్ రవి సంచలన ఆరోపణలు చేశారు.

Youtuber Ravi On Harsha Sai: తెలుగు రాష్ట్రాల్లో హర్ష సాయి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ రాబిన్ హుడ్ లా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మంచి అనే ముసుగులో హర్ష సాయి పేదలను అడ్డుపెట్టుకుని మోసం చేస్తున్నాడని.. ఇతని వెనుక పెద్ద మాఫియా ఉందని.. ఇతనొక ఉ*గ్రవాదితో సమానమని ప్రముఖ యూట్యూబర్ రవి సంచలన ఆరోపణలు చేశారు.

హర్ష సాయి పేదలను వాడుకుంటున్నాడు.. పెద్ద మాఫియా ఉంది: యూట్యూబర్ రవి

హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. పేద ప్రజలకు సహాయం చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పేదలకు టీవీలు, ఫ్రిడ్జ్ లు వంటివి ఇవ్వడం, డబ్బులు అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం, పెట్రోల్ ఫ్రీగా పోయించడం ఇలా హర్ష సాయి చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు. దీంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ తో ఆ మధ్య ఒక మూవీ కూడా స్టార్ట్ చేశాడు. అయితే హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని మూడేళ్ళ నుంచి ఒక వ్యక్తి ఆరోపిస్తున్నారు. అతనే రవి మార్క అలియాస్ యువసామ్రాట్ రవి. ఈయన యూఎస్ లో ఉండేవారు. యూట్యూబ్ లో హర్ష సాయి ఫ్రాడ్ అని, మోసగాడని ఆరోపిస్తూ అనేక వీడియోస్ అప్లోడ్ చేశారు.

తాజాగా ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ఇతనో పెద్ద మాఫియా నడుపుతున్నాడని.. ఇతని వెనుక నోయిడాకి చెందిన పెద్ద ముఠా ఉందని ఆరోపించారు. పైకి సాఫ్ట్ వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి పది వేలు, 20 వేలు ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేపిస్తుందని.. అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తుందని అన్నారు. ఇక హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి కనీసం 90 లక్షలు తీసుకుంటాడని.. అందులో 60 లక్షలు జీఎస్టీ కడతాడని.. మిగతా 40 లక్షలు అతని ఖాతాలో పడతాయని రవి ఆరోపించారు.

బ్యాంకు ఖాతాలో పడ్డ డబ్బే కాకుండా.. ఫిజికల్ గా కూడా డబ్బు ఇస్తారని.. ఆ మధ్య నోవాటెల్ హోటల్ లో హర్ష సాయి డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు. డేట్, టైం చెప్తా కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చునని.. అప్పుడు హర్ష సాయి అసలు రంగు బయటపడుతుందని అన్నారు. హర్ష సాయి మీద చేసే ఆరోపణలన్నిటికీ తన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని అన్నారు. హర్ష సాయి తప్పు చేయడం కోసం (ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదించడం) పేదలను వాడుకుంటున్నాడని.. అందుకోసం వాళ్ళకి ఫ్రీగా పెట్రోల్ ఇవ్వడం, డబ్బు సహాయం చేయడం వంటివి చేస్తున్నాడని ఆరోపించారు.

బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కోసమే హర్ష సాయి ఈ విధంగా మనుషులను వాడుకుంటున్నాడని ఆరోపించారు. తాను మంచోడు అనిపించుకుంటేనే కదా తనను జనాలు నమ్మేది.. నమ్మితేనే కదా బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టేది.. పెడితేనే కదా జనాలు నష్టపోయేది.. నష్టపోతేనే కదా హర్ష సాయికి లక్షలు, కోట్లు వచ్చేది అంటూ కామెంట్స్ చేశారు. ఒక వీడియోలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 40 లక్షలు వస్తాయని.. అలాంటిది ఎన్ని వీడియోస్ లో ఎన్ని యాప్ లు ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.

హర్ష సాయి ఒక్కడే కాదని.. ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ జనాన్ని ఆర్థికంగా నష్టం చేకూర్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని అన్నారు. భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ కోవకే వస్తారంటూ ఆరోపించారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. హర్ష సాయి ఒక ఉ*గ్రవాదితో సమానమని యూట్యూబర్ రవి సంచలన కామెంట్స్ చేశారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారి కంటే కూడా హర్షసాయి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని.. జనానికి చిల్లర వేసి కోట్లు కొల్లగొడుతున్నాడని యూట్యూబర్ యువసామ్రాట్ రవి ఆరోపణలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి