iDreamPost
android-app
ios-app

తన కన్నా 20 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ.. కారణమేమిటంటే..?

  • Published Jun 03, 2024 | 2:20 PM Updated Updated Jun 03, 2024 | 3:58 PM

తన కన్నా 20 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ.. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పెళ్లి గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ప్రస్తుతం అతడికి 39 కాగా, ఆమెకు 59 ఏళ్లు. ఇంతకు ఆమె అతడ్ని చేసుకోవడానికి కారణం ఏంటంటే..?

తన కన్నా 20 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ.. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పెళ్లి గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ప్రస్తుతం అతడికి 39 కాగా, ఆమెకు 59 ఏళ్లు. ఇంతకు ఆమె అతడ్ని చేసుకోవడానికి కారణం ఏంటంటే..?

  • Published Jun 03, 2024 | 2:20 PMUpdated Jun 03, 2024 | 3:58 PM
తన కన్నా 20 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న మహిళ.. కారణమేమిటంటే..?

గతంలో ఓ పెళ్లి సంబంధం చూస్తే అమ్మాయి/అబ్బాయి గుణ గణాలతో పాటు ఒడ్డు, పొడువు, వయస్సు బేధం చూసేవారు. అబ్బాయి వయస్సు కన్నా అమ్మాయి వయస్సు 10-15 ఏళ్లు గ్యాప్ ఉన్న చేసేసేవారు. కానీ అమ్మాయి.. అబ్బాయి కన్నా ఒక్క గంట ముందు పుట్టినా.. క్యాన్సిల్ అయిపోయేది. కానీ ఈ రోజుల్లో ఆ బేరియర్స్ ఏమీ లేవు. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకునే విషయంలో. ప్రేమకు, పెళ్లికి వయస్సుతో సంబంధం ఉండటం లేదు. కుల, మతాలే కాదు.. వయస్సు వంటి తారతమ్యాలు కూడా లేవు. తండ్రి వయస్సున్న వ్యక్తిని మనువాడుతోంది యువతి. అలాగే తన కన్నా వయస్సులో చాలా పెద్దదైన మహిళలతో పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు యువకుడు. ఇటీవల కాలంలో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా అవుతున్నాయి.

సాధారణంగా ఓ మహిళ ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అయితే.. సెకండ్ ఛాన్స్ తీసుకోదు. ఎందుకంటే.. తొలి మ్యారేజ్ లైఫ్ మిగిల్చిన చేదు అనుభవాలు, పాఠాలు ఆమెను ఒంటరిగా ఉండేలా చేస్తుంటాయి. తల్లిదండ్రులు పోరు పెట్టినా.. మరో పెళ్లి చేసుకునేందుకు వెనకాడుతుంటారు. తన జీవితంలోకి ఎంటరయ్యే సెకండ్ హస్బెండ్ విషయంలో ఎన్నో ఆందోళనలు నెలకొంటాయి. భర్త చనిపోయిన వారి కన్నా.. డివోర్స్ తీసుకున్న మహిళల విషయంలో ఆ అలజడి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొంత మంది పిల్లలకు పెళ్లయ్యాక..ఒంటరి తనం భరించలేక తోడు వెతుకుతున్నారు. 50 ఏళ్ల తర్వాత సెకండ్ ఆప్షన్‌కు ఓకే చెబుతున్నారు. అదిగో అలాంటి మహిళ స్టోరీనే ఇది.

గీత పెళ్లైన 28 ఏళ్లకు భర్త నుండి విడిపోయింది. అతడు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో డివోర్స్ తీసుకుంది. ఈ డిప్రెషన్ నుండి బయటపడటానికి గాయపడ్డ వీధి జంతువులను రక్షించడంలో తలమునకలు అయ్యింది. ఆ సమయంలో గీత జీవితంలోకి వచ్చాడు నిఖిల్ అనే వ్యక్తి. అప్పటికే ఆమెకు 56 సంవత్సరాలు. నిఖిల్ ఆమె కన్నా 20 ఏళ్లు చిన్నవాడు. ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తరచుగా పాలిటిక్స్, జంతువుల గురించి మాట్లాడుకునేవారు. అలా ఆమె తన గతాన్ని పంచుకుంది. దీంతో గీతను ఆ ట్రామాలో నుండి బయటపడేలా చేశాడు అతడు. అలా గంటలు గంటలు ఫోనులో మాట్లాడుకునే వారు. ఆ పరిచయం, ప్రేమగా మారింది.  ఆమెకు ప్రపోజ్ చేశాడు నిఖిల్. అనంతరం ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు. ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లై మూడేళ్లు కాగా, ఇప్పటి వరకు తను ఇలాంటి ప్రేమ మునుపెన్నడు చూడలేదని అంటోంది ఆ మహిళ. ఇప్పుడు అతడి వయస్సు 39 కాగా, ఆమె వయస్సు 59 ఏళ్లు. ప్రస్తుతం వీరి స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by People of India (@officialpeopleofindia)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio